Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుండి రెండు జట్లు అవుట్

Champions Trophy 2025
x

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుండి రెండు జట్లు అవుట్

Highlights

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఆరవ మ్యాచ్ రావల్పిండిలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ రెండు జట్లు భారతదేశం, పాకిస్తాన్‌లతో పాటుగా గ్రూప్ Aలో ఉన్నాయి.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఆరవ మ్యాచ్ రావల్పిండిలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ రెండు జట్లు భారతదేశం, పాకిస్తాన్‌లతో పాటుగా గ్రూప్ Aలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌పై సులభమైన విజయాన్ని సాధించింది. న్యూజిల్యాండ్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ను ఓడించింది. న్యూజిలాండ్ విజయం తర్వాత రెండు జట్లు సెమీ-ఫైనల్స్ రేసు నుండి నిష్క్రమించాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీ-ఫైనల్స్‌లో తన స్థానాన్ని భద్రపరచుకుంది. దీంతో పాకిస్తాన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. దీనితో ఈ జట్టు అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్స్ రేసులో నిలవాలంటే పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌పై విజయం సాధించాల్సిన అవసరం ఉంది. కానీ న్యూజిలాండ్ విజయం వారి ఆశలకు గండి కొట్టింది. భారీ ఆశలతో ఈ టోర్నమెంట్‌లోకి వచ్చిన పాకిస్తాన్ జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.

పాకిస్తాన్ తో పాటు, బంగ్లాదేశ్ జట్టు కూడా సెమీ-ఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది. ఈ రెండు జట్లు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. కాగా, రెండవ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో ఓడిపోయింది. మరోవైపు, న్యూజిలాండ్ కంటే ముందు బంగ్లాదేశ్ భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఓడిపోయింది. ఇప్పుడు ఈ రెండు జట్లు గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌ను ఒకదానితో ఒకటి ఆడతాయి. ఇది పాయింట్ల పట్టికపై ఎటువంటి ప్రభావం చూపదు.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు మాత్రమే చేయగలిగింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో అత్యధికంగా 77 పరుగులు చేశాడు. అతను తప్ప మరే ఆటగాడూ 50 పరుగుల మార్కును చేరుకోలేకపోయాడు. 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు. కేవలం 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించి, తన జట్టును విజయపథంలో నడిపించాడు. న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories