Champions Trophy 2025: దిగ్గజ క్రికెటర్లకు భారీగా పెరిగిన క్రేజ్‌.. ఆ విషయంలో కోహ్లీని కూడా బీట్‌ చేసిన పాండ్యా..!

Champions Trophy 2025 Pandya Beats Virat Kohli Record and Other Indian Cricketers Surging Popularity After Historic Win
x

Champions Trophy 2025: దిగ్గజ క్రికెటర్లకు భారీగా పెరిగిన క్రేజ్‌.. ఆ విషయంలో కోహ్లీని కూడా బీట్‌ చేసిన పాండ్యా..!

Highlights

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత మన భారత దిగ్గజ క్రికెటర్లరకు సోషల్‌ మీడియాలో క్రేజ్‌ మరింత పెరిగిందట.

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత మన భారత దిగ్గజ క్రికెటర్లరకు సోషల్‌ మీడియాలో క్రేజ్‌ మరింత పెరిగిందట. మార్చి 9 ఆదివారం ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. దుబాయ్‌ వేధికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ సమయంలో మన మెన్‌ ఇన్‌ బ్లూస్‌కు కూడా క్రేజ్‌ బాగా పెరిగిందట.

భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని 12 ఏళ్ల తర్వాత జరిగింది. దీంతో అన్ని దేశాలతోపాటు దాయాది దేశం నోటికి సైతం లాక్ పడింది. విమర్శకులు సైతం మన భారత క్రికెటర్ల ఆట తీరు చూసి మెచ్చుకున్నారు. ఒక వైపు 15 సార్లు వరుసగా టాస్‌లు ఓడుతూ వచ్చిన ఇండియా.. మరోవైపు ఆడిన ప్రతి మ్యాచ్‌ గెలుస్తూ వచ్చింది. అయితే, భారత్‌తోపాటు మన క్రికెట్‌ దిగ్గజాలకు కూడా క్రేజ్‌ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిందట.

కొన్ని దశాబ్దాలుగా భారత్‌ క్రికెట్‌లో మంచి ప్రతిభను కనబరుస్తుంది. సోషల్‌ మీడియా వేధికగా ఎన్నో విమర్శలు పొందినవారే నేడు అదే సోషల్‌ మీడియా వేధికగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఎందుకంటే ప్రధానంగా అన్ని దిగ్గజ దేశాలను బీట్‌ చేస్తూ ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకవడం.

ఓ వార్త నివేధిక ప్రకారం ఛాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో మన భారత క్రికెటర్లకు సోషల్‌ మీడియాలో ఫాలోయర్ల సంఖ్య భారీగా పెరిగిందట. అయితే, ఇందులో ప్రధానంగా విరాట్‌ కోహ్లీ, హార్ధిక్‌ పాండ్యాల గురించి చెప్పుకోవాలి. వీళ్ల క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

సోషల్‌ మీడియాలో స్టాటిస్టిక్స్‌లో హార్దిక్‌ పాండ్యాను బీట్‌ చేసిన వారే లేరట. కేవలం నెల రోజుల్లోనే ఈ ఆల్‌రౌండర్‌ 14 లక్షలకు పైగా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్స్‌ చేరారట. ఇక ఎక్స్‌ వేధికగా 43 వేల మంది, ఫేస్‌బుక్‌లో 40 వేల మందికి పైగా ఫాలోయర్స్‌ యాడ్‌ అయ్యారు. అది మనోడి క్రేజ్‌ అంటే..

క్రికెట్‌ టీమ్‌ను వెన్నుండి భారత విజయానికి కారణమైన రోహిత్‌ కూడా ఎన్నో విమర్శలకు గురయ్యారు. కానీ, ఒక్క నెలలో రోహిత్‌ ఖాతాలో ఇన్‌స్టాగ్రామ్‌ వేధికగా కొత్తగా 2.4 లక్షలకు పైగా చేరారు. ఇక ఎక్స్‌ 60 వేలు, ఫేస్‌బుక్‌లో వెయ్యి మందికిపైగా కొత్తగా ఫాలోయర్స్‌ చేరారు.

ఇక విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో మనోడి ఆటతీరుకు ఒక్కసారిగా ఫాలోయర్స్‌ పెరిగిపోయారట. ముఖ్యంగా కేవలం ఒక్క నెలలోనే ఎక్స్‌లో 3 లక్షలకు పైగా కొత్తగా చేరారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.8 లక్షలు, ఫేస్‌బుక్‌లో 32 వేలమందికి పైగా ఫాలోయర్స్‌ చేరారు. కేవలం విరాట్‌ కోహ్లీని ట్యాగ్‌ చేస్తూ 1.6 లక్షలకు పైగా పోస్టులు ఎక్స్‌ వేధికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన రోజు పోస్ట్‌ అయ్యాయట. అదీ విరాట్‌ క్రేజ్‌. వీళ్లతోపాటు మిగతా క్రికెటర్లకు గడిచిన నెలరోజుల్లో సోషల్‌ మీడియా వేధికగా ఫాలోయర్స్‌ సంఖ్య భారీగా పెరిగిందట.



Show Full Article
Print Article
Next Story
More Stories