Champions Trophy 2025: ఇండియా-పాక్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కు షాకిచ్చిన ఐసీసీ..!

Champions Trophy 2025: ఇండియా-పాక్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కు షాకిచ్చిన ఐసీసీ..!
x
Highlights

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా , పాకిస్తాన్‌ మధ్య అతిపెద్ద మ్యాచ్ ఫిబ్రవరి 23 న దుబాయ్‌లో జరుగనుంది.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా , పాకిస్తాన్‌ మధ్య అతిపెద్ద మ్యాచ్ ఫిబ్రవరి 23 న దుబాయ్‌లో జరుగనుంది. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తరువాత ఆతిథ్య పాకిస్తాన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించే ముప్పులో ఉంది. టోర్నమెంట్లో కొనసాగాలంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో భారత్ ను ఓడించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐసిసి పాకిస్తాన్‌కు షాకిచ్చింది. భారీ జరిమానా విధించింది.

పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. కరాచీలో ఆడిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టుకు స్లో రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించారు. గ్రౌండ్ అంపైర్ రిచర్డ్ కాటెల్బోరో, షరాఫుద్దాలా, థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ , మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ జరిమానా విధించారు. పాకిస్తాన్ మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానాగా తీసివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ దీనిని ఒప్పుకున్నారు.

ఐసిసి ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం.. నేరానికి పాల్పడినట్లు అవుతుంది. దీని కారణంగా నలుగురు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. న్యూజిలాండ్ చేతిలో మొదటి ఇన్నింగ్స్ తర్వాత పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ నుండి బయటపడే ప్రమాదాన్ని ఎదుర్కొంది. మొదటి మ్యాచ్‌లో భారతదేశం బంగ్లాదేశ్‌ను ఓడించింది. రెండవ మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారతదేశం గెలిస్తే, పాకిస్తాన్ వరుసగా 2 మ్యాచ్‌లను కోల్పోతుంది. అది మూడవ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను కూడా ఓడిస్తే అది 2 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. ఫిబ్రవరి 24 న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ గెలిస్తే భారత్ 4 పాయింట్లు, న్యూజిలాండ్ 4 పాయింట్లు సాధించనుంది. భారత్ చేతిలో ఓడిపోయిన తరువాత కూడా న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కి చేరుతుంది. మొత్తం మీద భారతదేశం చేతిలో ఓడిపోతే పాకిస్తాన్ దాదాపు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్ర్కమిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories