Chahal-Dhanashree: చివరి దశకు చాహల్-ధనశ్రీ విడాకుల ప్రక్రియ... భరణం ఎంత చెల్లించాల్సి ఉంటుంది?

Chahal-Dhanashree
x

Chahal-Dhanashree: చివరి దశకు చాహల్-ధనశ్రీ విడాకుల ప్రక్రియ... భరణం ఎంత చెల్లించాల్సి ఉంటుంది?

Highlights

Chahal-Dhanashree: చాహల్ తన క్రికెట్‌పై పూర్తిగా దృష్టి సారిస్తుండగా, ధనశ్రీ కూడా తన ప్రొఫెషనల్ కెరీర్‌లో ముందుకు సాగనున్నారు.

Chahal-Dhanashree: బాంబే హైకోర్టు నిర్ణయంతో యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రూ. 4.75 కోట్ల అలిమొని కోసం కుదిరిన ఒప్పందాన్ని కోర్టు గుర్తిస్తూ, చాహల్ ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించినందున మిగిలిన మొత్తం విడాకుల అనంతరం చెల్లించాలనే షరతును అమలు చేయాలని తెలిపింది. ఈ తీర్పు చాహల్‌కు ఊరటగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. మార్చి 22న ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ కోసం చాహల్ తన కొత్త జట్టుతో చండీగఢ్‌లో తీవ్రంగా శిక్షణ పొందుతున్నారు. కోర్టు కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, విడాకుల వ్యవహారాన్ని త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించింది. న్యాయమూర్తి మాధవ్ జందార్ మాట్లాడుతూ, చాహల్, ధనశ్రీ రెండున్నర సంవత్సరాలుగా వేరుగా జీవిస్తున్నందున, ఈ వివాహ బంధాన్ని కొనసాగించే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

ఇదివరకు వారి సంబంధంలో ఉద్రిక్తత ఉందనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండటంతో, వారి మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. ధనశ్రీ భారీ మొత్తంలో రూ. 60 కోట్ల అలిమొని డిమాండ్ చేసిందని వచ్చిన వార్తలను ఆమె కుటుంబం పూర్తిగా ఖండించింది. ఇది అవాస్తవమని, ఎవరు కూడా అటువంటి డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.

ఇప్పుడైతే కోర్టు తీర్పుతో చాహల్ - ధనశ్రీ వివాహ బంధం అధికారికంగా ముగియనుంది. నాలుగేళ్ల వివాహ బంధానికి తెరపడుతుండగా, ఇద్దరూ తమ తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. చాహల్ తన క్రికెట్‌పై పూర్తిగా దృష్టి సారిస్తుండగా, ధనశ్రీ కూడా తన ప్రొఫెషనల్ కెరీర్‌లో ముందుకు సాగనున్నారు. ఈ విడాకులు వారి వ్యక్తిగత జీవితంపై ఎంతటి ప్రభావం చూపిస్తాయో కాలమే నిర్ణయించాల్సిన విషయం.

Show Full Article
Print Article
Next Story
More Stories