నీరజ్ చోప్రాకి ఖేల్ రత్న.. క్రీడా అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్ర‌భుత్వం

Central Government Announced Khel Ratna and Arjuna Award
x

ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్ర‌భుత్వం 

Highlights

* నీర‌జ్ చోప్రాతో సహా 11 మందికి ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న.., శిఖర్ ధావన్ సహా 35 మందికి అర్జున అవార్డుల ప్రకటన

Khel Ratna and Arjuna Award: కేంద్ర ప్ర‌భుత్వం అక్టోబర్ 27న బుధవారం జాతీయ క్రీడా అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో బంగారు పతకం సాధించిన జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా స‌హా 11 మంది ఆట‌గాళ్ల‌ను మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుల‌కు సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది.

ఈ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుల‌ను అందుకోనున్న వారిలో నీర‌జ్ చోప్రాతో పాటు టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడల్ గెలిచిన రెజ్ల‌ర్‌ ర‌వి ద‌హియా, కాంస్యం గెలిచిన మ‌హిళా బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గొహైన్‌, పీఆర్ శ్రీజేష్‌, క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ సునీల్ ఛెత్రితో పాటు బ్యాట్మింటన్ ఆటగాడు ప్రమోద్ భగత్, సుమిత్ ఆంటిల్ (జావెలిన్ త్రోయ‌ర్), అవని లేఖరా(షూటర్), కృష్ణ (బ్యాట్మింటన్) ఏమ్ నర్వాల్ (షూటర్) లు ఉన్నారు.

ఇక ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుల‌తో మరో 35 మందికి అర్జున అవార్డులను కూడా ప్రకటించింది. ఈ లిస్టులో భారత క్రికెటర్ శిఖర్ ధావన్, హైజంప్ నుండి ప్రవీణ్ కుమార్, శరద్ కుమార్, నిషద్ కుమార్, బ్యాట్మింటన్ నుండి సుహాస్, భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (అర్చరీ) తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories