శ్రీలంక , ఆసీస్ సిరీస్‌కు భారత జట్టు ఇదే.. కీలక ఆటగాళ్లు దూరం

శ్రీలంక , ఆసీస్ సిరీస్‌కు భారత జట్టు ఇదే.. కీలక ఆటగాళ్లు దూరం
x
Team India
Highlights

శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ల్లో భాగంగా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ల్లో భాగంగా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 2020 జనవరిలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ భారత జట్టు ఆడనుంది. అంతే కాకుండా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్‌‌లో భారత జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కీలక ఆటగాళ్లను హిట్ మ్యాన్ ఓపెనర్ రోహిత్ శర్మ , పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ కు మాత్రమే వీరు ఇరువురు దూరం కానున్నారు.

శ్రీలంకతో జనవరి 5నుంచి 10 వరకు టీ20 సిరిస్‌ ప్రారంభం కానుంది. శ్రీలంక జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు టీ20ల సిరీస్ రెండు జట్లు ఆడనున్నాయి. శ్రీలంక పర్యటన అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్‌ జరగనుంది. ఆస్ట్రేలియాతో జనవరి 14 నుంచి 19 వరకు మూడు వన్డేల సిరిస్ జరుగుతుంది.

శ్రీలంక భారత జట్లు మధ్య గౌహతి వేదికగా టీ20 జనవరి 5న ఆరంభం కానుంది. ఇండోర్ వేదికగా 7వ తేదీన రెండో టీ20 , పూణె వేదికగా 10వ తేదీన మూడో టీ20 జరగనుంది. 2019లో రోహిత్ శర్మ విశ్రాంతి లేకుండా ఆడుతున్నాడు. రోహిత్ విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు అతని స్థానంలో వెస్టిండిస్ సిరీస్‌కు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అవకాశం కల్పించారు. కేఎల్ రాహుల్ తో కలిసి ఓపెనర్ గా ధావన్ దిగనున్నారు. షమీకి విశ్రాంతినిచ్చిన బీసీసీఐ అతని స్థానంలో పేసర్ బుమ్రా కూడా అవకాశం కల్పించారు. వెన్నునొప్పితో జస్ప్రీత్ బుమ్రా బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, విండీస్ సిరీస్ దురమైయ్యాడు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కొనసాగనున్నాడు. షమీ శ్రీలంక, ఆసీస్ సిరీస్ కు దూరం కానున్నాడు.

శ్రీలంక టీ20 సిరీస్ భారత జట్టు:

కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కె.ఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీద్ బుమ్రా, మనీష్ పాండే, నవదీప్ షైనీ, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.

ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ భారత జట్టు :

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మనీష్ పాండే, జస్ప్రీత్ బుమ్రా, ఠాకూర్, సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories