
టెస్టుల్లో తన రికార్డును ఏవరు బద్దలు చేస్తారో ఎవరికి ఆ సత్తా ఉందో అంచనా వేశారు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా
టెస్టుల్లో తన రికార్డును ఏవరు బద్దలు చేస్తారో ఎవరికి ఆ సత్తా ఉందో అంచనా వేశారు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 582 బంతుల్లో 43 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 400 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 16 ఏళ్లుగా లారా రికార్డు పదిలంగానే ఉంది. అయితే అప్పటి నుంచి లారా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు.
ఇటీవలే అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో అస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ లారా రికార్డు బద్దలు కొట్టేదిశగా పయనించాడు. అయితే 335 పరుగులు చేసిన వార్నర్ కెప్టెన్ టిమ్‌పైన్ నిర్ణయంతో కూతవేటు దూరంలో ఆగిపోయాడు. వార్నర్ 335 వద్ద ఉండగానే టిమ్‌పైన్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు . దీంతో లారా రికార్డుపై మళ్లీ చర్చ మొదలైంది.
తాజాగా ఈ రికార్డుపై స్పందించిన లారా.. తన రికార్డును ఇద్దరూ బ్రేక్ చేసే సత్తా ఇద్దరూ భారత క్రికెటర్లకు మాత్రమే ఉందన్నారు. టెస్టుల్లో నాలుగు వందల పరుగుల రికార్డు బ్రేక్ చేయగలిగే సత్తా టీమిండియా క్రికెటర్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ కు, అలాగే క్రికెటర్ పృథ్వీ షా మాత్రమే తన రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉందని లారా జోస్యం చెప్పారు. రోహిత్ శర్మ ఆరంభం నుంచి ప్రత్యర్థి జట్టు బౌలర్లపై అలాక్ చేయాలని సూచించారు. మరో క్రికెటర్ పృథ్వీ షా 19 ఏళ్లే దీంతో అతను కొన్ని ఏళ్లు క్రికెట్లో ఉంటాడు, అతను తప్పకుండా తన రికార్డు బ్రేక్ చేస్తాడు అని లారా చెప్పారు. నిషేధిత ఉత్ప్రేరకం వాడటంతో ద్వారా 8 నెలలపాటు నిషేదం విధించింది. కాగా.. ఇటివలే క్రికెట్లోకి అడుగు పెట్టిన పృథ్వీ షా రాణిస్తున్నాడు. ముస్తాక్ అలీ టీ20 టోర్నోలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 2020లో టీమిండియాలో పృథ్వీ షా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
131 టెస్టు మ్యాచులు ఆడిన ఈ విండీస్ దిగ్గజం 232 ఇన్నింగ్స్ లో 34 సెంచరీలు, 45 ఆర్థ సెంచరీలతో 11,953 పరుగుల సాధించారు. కెరీర్ వ్యతిగత స్కోరు 400* మైలురాయిని సాధించాడు. 299 వన్డేల్లో 10,405 పరుగులు చేశారు. వ్యక్తిగత అత్యధిక స్కోరు 169, 63 అర్థ సెంచరీలు, 19 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో లారా పేరిట ఉన్నరికార్డు ఎంతో మంది క్రికెటర్లు బ్రేక్ చేయాలని భావించిన అది సాధ్యపడలేదు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




