Boxing Day Test: రెండో టెస్ట్ కు టీమిండియాలో భారీ మార్పులు

Boxing Day Test: రెండో టెస్ట్ కు టీమిండియాలో భారీ మార్పులు
x

ఫైల్ ఫోటో 

Highlights

ఫస్ట్ టెస్ట్‌లో ఘోర పరాభవం తర్వాత.. టీమిండియా తర్వాత మ్యాచ్‌కు సిద్ధం అవుతోంది. మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. అందుకే జట్టులో భారీ మార్పులు చేసింది.

ఫస్ట్ టెస్ట్‌లో ఘోర పరాభవం తర్వాత.. టీమిండియా తర్వాత మ్యాచ్‌కు సిద్ధం అవుతోంది. మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. అందుకే జట్టులో భారీ మార్పులు చేసింది. ఇక విరాట్ సెలవుల మీద ఇండియాకు చేరుకోగా.. రహానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

మెల్‌బోర్న్‌ వేదికగా శనివారం నుంచి ఆస్ట్రేలియాతో స్టార్ట్ కాబోయే రెండో టెస్టుకు బీసీసీఐ తుది జట్టు ప్రకటించింది. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌ పృథ్వీషాను జట్టు నుంచి తప్పించింది. మయాంక్‌కు తోడుగా శుభ్‌మన్‌గిల్‌కు చాన్స్ ఇచ్చింది. వికెట్‌ కీపర్‌ స్థానంలో వృద్ధిమాన్‌ సాహాను పక్కనపెట్టి... రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన రిషభ్‌పంత్‌ను ఎంపిక చేసింది. అలాగే గాయం కారణంగా మిగతా సిరీస్‌కు దూరమైన మహ్మద్‌ షమి స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను తీసుకుంది. గిల్‌, సిరాజ్‌కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్.

ఇక అడిలైడ్‌లో టెస్టులో భారత్‌ ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా కసిమీద కనిపిస్తోంది. ఐతే అటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పితృత్వపు సెలవుల మీద తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. దీంతో రెండో టెస్ట్ నుంచి అజింక్య రహానె జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా సైతం తుదిజట్టులో అవకాశం పొందాడు.

తొలిటెస్టులో ఘోర పరాభం తర్వాత జట్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయ్. దీంతో బాక్సింగ్ డే టెస్టులో భారత్ ప్రదర్శన ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక అటు కెప్టెన్‌ కోహ్లీ భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యే ముందు అడిలైడ్‌లో జట్టు సభ్యులతో మాట్లాడాడని తాత్కాలిక సారథి రహానె చెప్పాడు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు తమ శక్తి మేరకు రాణించాలని కోరాడన్నాడు. ఎన్నో ఏళ్లుగా కలిసికట్టుగా ఆడుతున్నామని, ఇప్పుడు కూడా అలాగే ఆడాలని కోహ్లీ సూచించినట్లు తెలిపాడు. ఇక అటు డాషింగ్ బ్యాట్స్‌మెట్ రోహిత్ శర్మ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకోగా.. మూడో టెస్ట్ నుంచి అతను అందుబాటులో ఉండనున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories