ఢిల్లీ రణరంగం వెనుక దీపూ సిద్ధూ .. ఎవరీ సిద్ధూ?

ఢిల్లీ రణరంగం వెనుక దీపూ సిద్ధూ .. ఎవరీ సిద్ధూ?
x
Highlights

కిసాన్‌ పరేడ్‌లో జరిగిన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

కిసాన్‌ పరేడ్‌లో జరిగిన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విధ్వంసానికి కారకులెవరో గుర్తించే పనిలో పడ్డారు. డ్రోన్‌ కెమెరాలు..సీసీటీవీ ఫుటేజ్‌.. పోలీసుల కెమెరాల వీడియోలను పరిశీలిస్తున్నారు. అయితే ఢిల్లీలో విధ్వంసానికి దీపూ సిద్ధూ ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ దీప్‌ సిద్ధూ ఎవరు..?

పంజాబ్‌లోని ముక్తసర్‌ జిల్లాకు చెందిన దీపూ సిద్ధూ 1984లో జన్మించాడు. ఇతడు సినీ నటుడే కాకుండా సామాజిక కార్యకర్త కూడా. 2015లో రమ్తా జోగి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌కు సహాయకుడిగా సిద్దూ ఉన్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పూర్‌ నుంచి బీజేపీ తరపున సన్నీ డియోల్‌ పోటీ చేయగా సిద్ధూ మొత్తం వ్యవహారం నడిపించాడు.చెప్పాలంటే దీపూ సిద్ధూ బీజేపీ నాయకుడిగా గుర్తింపు పొందాడని తెలుస్తోంది. దానికి గతంలో ప్రధాని మోదీ, అమిత్‌ షాను కలిసి దిగిన ఫొటోలు బలంచేకూరుస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫోటేలు వైరలయ్యాయి. ఇదిలా ఉంటే.. సిద్ధూను తాము ముందు నుంచే వ్యతికేకిస్తున్నామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీకి ముందు రోజు కూడా సిద్ధూ రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను సిద్ధూ ఖండించారు. అంతమంది రైతులు ఎర్రకోట వెళ్లేలా తాను ఎలా ప్రోత్సహించగలనంటున్నాడు. అంతేకాదు ఉద్యమానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు ఒక్క వీడియో కూడా లేదంటున్నాడు. అయితే.. రైతు సంఘాలు మాత్రం తాము శాంతి యుతంగా చేపట్టాలనుకున్న ఉద్యమంలో దీపు రావడంతో విధ్వంసం మొదలైందని ఆరోపిస్తున్నారు. మొత్తానికి సిక్కుల జెండాతోపాటు రైతుల జెండా ఎగురవేశానంటున్న సి‌ద్ధూ.. రైతుల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేసినట్లు చెబుతున్నాడు. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై కొట్టిపారేస్తున్న సిద్ధూపై.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరీ...

Show Full Article
Print Article
Next Story
More Stories