BCCI: భారత ఆటగాళ్లకు స్పెషల్ వెహికల్స్ లేవు.. బీసీసీఐ కొత్త విధానం

BCCI
x

BCCI: భారత ఆటగాళ్లకు స్పెషల్ వెహికల్స్ లేవు.. బీసీసీఐ కొత్త విధానం

Highlights

BCCI: బీసీసీఐ ఇటీవల రూపొందించిన 10-పాయింట్ల విధానాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అమలు చేసింది.

BCCI: బీసీసీఐ ఇటీవల రూపొందించిన 10-పాయింట్ల విధానాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అమలు చేసింది. బిసిసిఐ తన కొత్త విధానాలను భారతదేశం-ఇంగ్లాండ్ టి 20 సిరీస్ మ్యాచ్‌లు జరుగుతున్న అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు పంపింది. ఆ తరువాత దాని అమలు పనులు కూడా ప్రారంభమయ్యాయి.బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ దీనిని ఇప్పటికే షురూ చేసింది. ఇక్కడ జనవరి 22 నుండి భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. బిసిసిఐ నిర్దేశించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం అసోసియేషన్ పనిచేయడం ప్రారంభించిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ ధృవీకరించారు.

ఏ ఆటగాడికీ ప్రత్యేక కారు ఉండదు: CAB అధ్యక్షుడు

బీసీసీఐ 10 పాయింట్ల విధానం ప్రకారం.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఏ ఆటగాడికి ప్రత్యేక కారును అందించదని స్నేహశిష్ గంగూలీ అన్నారు. భారత జట్టు కోసం జట్టు బస్సును ఏర్పాటు చేస్తామని ఆయన పిటిఐకి తెలిపారు. అంతే కాకుండా వారికి వ్యక్తిగతంగా ఎలాంటి వాహనం ఇకముందు ఇవ్వబడదని తెలిపారు.

బస్సులోనే ప్రయాణించాలి

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తాము మార్గదర్శకాలను అనుసరిస్తామని చెప్పారు. అందరు ఆటగాళ్లు జట్టుతో పాటే ప్రయాణిస్తారని స్పష్టంగా పేర్కొన్నారు. జట్టు నుంచి ఏ ఆటగాడు వేరుగా ప్రయాణించడానికి అనుమతి లేదన్నారు. బీసీసీఐ 10 పాయింట్ల విధానాన్ని రూపొందించింది. ఇందులో అందరు ఆటగాళ్లు మ్యాచ్ లేదా ప్రాక్టీస్ సెషన్‌కు జట్టు బస్సులో మాత్రమే ప్రయాణించాలి.

కొత్త బీసీసీఐ విధానంలో జట్టు బస్సులో ప్రయాణించడంతో పాటు ఆటగాళ్ల కుటుంబానికి సంబంధించినవి. దేశీయ క్రికెట్‌లో ఆడటం మొదలైన వాటికి అనేక కొత్త నియమాలు రూపొందించబడ్డాయి. ఈ విధానం రూపొందించిన తర్వాత భారత జట్టు ఆడుతున్న తొలి సిరీస్ ఇది. ఇందులో మొదటి మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతోంది. ఆ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్ర క్రికెట్ సంఘంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిలిచింది.

భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలో జరుగనుంది. రెండో టీ20 మ్యాచ్ జనవరి 25న చెన్నైలో, మూడో, చివరి టీ20 మ్యాచ్ జనవరి 28న రాజ్‌కోట్‌లో జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories