MS Dhoni: నయా పైసా వద్దు.. బాధ్యతగా పని చేస్తా

BCCI Secretary Jai Shah Says MS Dhoni Will Work Team India Mentor For Free
x

మహేంద్రసింగ్ ధోని (ట్విట్టర్ ఫోటో)

Highlights

* భారత క్రికెట్ జట్టు మెంటర్ గా నయా పైసా తీసుకోకుండా ఒప్పుకున్న ధోని

T20 World Cup 2021: భారత మాజీ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని అతి త్వరలో మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్ 2021 కోసం భారత క్రికెట్ జట్టుకు మెంటర్ గా బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) సెక్రటరీ జై షా మాట్లాడుతూ ధోని భారత జట్టుకు మెంటర్ గా బాధ్యత తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు.

మొదట ధోనిని సంప్రదించినపుడు భారత జట్టుకు మెంటర్ గా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానని అందుకుగాను నయ పైసా కూడా తీసుకోనని, తన సేవని బాధ్యతగానే భావించి ఉచితంగానే పని చేస్తానని ధోని చెప్పినట్లు జై షా తెలిపాడు. రానున్న వరల్డ్ కప్ 2021 అటు కపిల్ దేవ్, విరాట్ కోహ్లి, ధోని సమక్షంలో భారత్ టీ20 ప్రపంచ కప్ ని మరోసారి గెలుస్తుందని జై షా ఆశాభావం వ్యక్తం చేశాడు.

భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ కోహ్లి, ధోని ఇద్దరు 200 కి పైగా టీ20 మ్యాచ్ ల అనుభవం ఉండటంతో మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు జట్టుకు ఎంతో ఉపయోగపడుతాయని, మెంటర్ గా ధోని కంటే గొప్ప వ్యక్తిలేడని.. అతని ఎంపిక టీం మేనేజ్మెంట్, టీమిండియా, బిసిసిఐ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమేనని ప్రసాద్ తెలిపాడు. అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ 2021 క్వాలిఫైర్ మ్యాచ్ లు ప్రారంభం కానుండగా అక్టోబర్ 24న భారత్ - పాక్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories