రోహిత్ ఫిట్‌నెస్‌పై కంగారు లేదు : బీసీసీఐ

రోహిత్ ఫిట్‌నెస్‌పై కంగారు లేదు : బీసీసీఐ
x
Highlights

బంగ్లాదేశ్‌తో జరగబోయే టీ20కి ముందు భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు.

బంగ్లాదేశ్‌తో జరగబోయే టీ20కి ముందు భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. దీంతో రోహిత్ మ్యాచ్ కు మందు గాయపడడంతో జట్టు యాజమాన్యంతో పాటు రోహిత్ అభిమానులు కంగారు పడ్డారు. అయితే రోహిత్ గాయం పెద్దది కాకపోవడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు.నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో రోహిత్ ఉదర భాగంలో బంతి బలంగా తగిలింది.

దీంతో అతడు విలవిలలాడాడు అనంతరం ప్రాక్టీస్ సెషన్ నుంచి మైదానం వీడాడు. రోహిత్ ను పరీక్షించిన వైద్యులు గాయంతో ఇబ్బంది లేదని చెప్పారు. రోహిత్ ఆదివారం జరగబోయే తొలి టీ20 ఆడవచ్చని స్పష్టం చేశారు. దీంతో బీసీసీఐ కూడ రోహిత్ మ్యాచ్ ఆడతాడని, అతడు ఫిట్‌గానే ఉన్నాడని తెలిపింది. నవంబర్ మూడు నుంచి బంగ్లాతో టీ20 సిరీస్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories