ఆటగాళ్ళు ఎక్కడ నుంచి వస్తారు... ఐపీఎల్‌ నిర్వహణపై దాదా వ్యాఖ్యలు..

ఆటగాళ్ళు ఎక్కడ నుంచి వస్తారు... ఐపీఎల్‌ నిర్వహణపై దాదా వ్యాఖ్యలు..
x
Sourav Ganguly (File Photo)
Highlights

క‌రోనా ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. దీని ధాటికి క్రీడా రంగం కుదేలైంది. అన్ని క్రీడా టోర్నీ వాయిదా పడ్డాయి. టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాదికి వాయిదా వేశారు.

క‌రోనా ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. దీని ధాటికి క్రీడా రంగం కుదేలైంది. అన్ని క్రీడా టోర్నీ వాయిదా పడ్డాయి. టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఇక బీసీసీఐ ప్ర‌తిష్టాత్మ‌క లీగ్ ఇండియాన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) సీజ‌న్ 13 ఏప్రిల్ 15 వ‌ర‌కు వాయిదా వేశారు. అయితే అప్ప‌టి వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగ‌నుంది. లాక్ డౌన్ త‌ర్వాత ఐపీఎల్ జ‌రుగుతుందో లేదో అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సోమ‌వారం ఐపీఎల్ నిర్వ‌హ‌న‌పై స్ప‌ష్టత నిస్తామ‌ని తేల్చి చెప్పారు.

ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై మీడియా అడిగిన ప్రశ్నకు గంగూలీ ఘాటుగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నానీ, ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు క్రీడల భవిష్యత్‌ ఏముంటుందని ఆయ‌న ప్రశ్నించారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మ‌ని చెప్పారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితులు గమనిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేం ఏం చెప్పలేం. అయినా విమానాశ్రయాలు మూతపడ్డాయి. దేశంలో లాక్ డౌన్ కొన‌సాగుతుంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు, ఎవరూ ఇళ్లు క‌దిలి వెళ్లలేరు. ఈ పరిస్థితి మే వరకూ ఉంటుందనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయ‌ర్లు ఎక్క‌డ‌నుంచి వ‌స్తారు. ఐపీఎల్‌ను త‌ర్వాత కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి అన్నారు. బీసీసీఐలోని ఇత‌ర‌ అధికారులతో క‌లిసి ఐపీఎల్ పై చర్చించి సోమవారం స్ప‌ష్ట‌త ఇస్తామ‌ని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories