క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్.. టీ20 ప్రపంచ కప్ పై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు

క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్.. టీ20 ప్రపంచ కప్ పై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు
x
Highlights

కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఈ మహమ్మారి వల్లన అన్ని క్రీడా టోర్నీలు వాయిదాలు పడగా.. టోక్యో ఒలింపిక్స్ 2021కి వాయిదా పడింది.

కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఈ మహమ్మారి వల్లన అన్ని క్రీడా టోర్నీలు వాయిదాలు పడగా.. టోక్యో ఒలింపిక్స్ 2021కి వాయిదా పడింది. ఇలా బీసీసీఐ ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమయర్ లీగ్ ( ఐపీఎల్) వాయిదా పడింది. అసలు ఈ ఏడాది జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి.

తాజాగా అక్టోబర్‌లో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్‌పై బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్‌కప్‌ జరిగే అవకాశాలు లేవని వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావం వల్ల అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణ అనేది అసాధ్యమని, ఆ సమయానికి ప్రజలు మ్యాచ్‌లు చూడటానికి వస్తారనే గ్యారంటీ లేదన్నారు. ఈ సంద్భంగా బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రయాణాలు ఆరంభమైతే ఓ స్పష్టత వస్తుంది. ఐనా అంతర్జాతీయ ప్రయాణాలు ఎంతవరకూ సురక్షితం అనేది చెప్పలేం. జూన్‌ నెల లోపు అంతా సర్దుకుంటుందని కొందరు అంటున్నారు. చాలా సమయం పడుతుందని మరికొందరు అంటున్నారు.

అసలు సమస్య టోర్నీకి ఆతిథ్యమిచ్చే క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ), ఐసీసీలది కాదు. ప్రభుత్వాల పాత్ర చాలా కీలకం. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచకప్ కు అనుమతి ఇస్తుందా.. ఇతర దేశాల ప్రభుత్వాలు తమ క్రికెట్‌ బృందాలను పంపడానికి అనుమతి ఇస్తాయా. ఇదంతా గందరగోళంగా ఉంది. టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా తప్పితే మరో మార్గం లేదని అన్నారు.

ఇదిలా ఉంటే ఐసీసీ T20 ప్రపంచ కప్ నిర్వహణపై సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. కాగా.. ఐసీసీ చర్చించినా షెడ్యూల్‌ ప్రకారం వరల్డ్ కప్ కొనసాగించడానికి డైరెక్ట్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే ప్రస్తక్తే ఉండదు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ అది ఎంతవరకూ సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశాలలో నిర్ణయం తీసుకొనుంది.

అయితే టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా అక్టోబర్‌లో జరగాల్సిఉంది. కరోనా కట్టడిల్లో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబర్‌ 30 వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేయడంతో పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసింది. అప్పటిలోగా దేశంలో పరిస్థితులు అదుపులోకి రాకపోతే ఆ ఆంక్షల్ని పొడిగించే అవకాశం ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా టి20 వరల్డ్ కప్ నిర్వహణపై తలలు పట్టుకుంటోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories