IPL 2021: 'నెగెటివ్‌' ఉంటే వాంఖడేలో ఐపీఎల్‌ చూడొచ్చు!

Wankhede Stadium Mumbai
x

Wankhede Stadium Mumbai File photo

Highlights

IPL 2021:ఈ నేపథ్యంలో ఇండియాన్ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ సీజన్ 2021 ఎడిషన్ 14ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు.

IPL 2021: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఇండియాన్ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ సీజన్ 2021 ఎడిషన్ 14ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వాఖండే క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచులు నేరుగా వీక్షించాలనే వారికీ అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అయితే అందుకు కొన్ని నిబంధలను విధించింది.

అయితే ఇది అభిమానులకు కాదు.. మ్యాచ్ లు వీక్షించడానికి వచ్చే కౌన్సిల్ సభ్యులకు మాత్రమే. బీసీసీఐ ప్రొటోకాల్‌ ప్రకారం.. అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లకు వాంఖడే ఆతిథ్యమివ్వనుంది. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం స్టేడియం సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను తాము చూడాలనుకునే మ్యాచ్‌కు 48 గంటలలోపు చేయించుకోవాల్సి ఉంటుందని అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు ఎంసీఏ కార్యదర్శి సంజయ్‌ నాయక్‌ స్పష్టం చేశారు.అందులో నెగెటివ్‌ అని వస్తేనే మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంలోకి అడుగుపెట్టనిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా నెగెటివ్‌ రిపోర్టును కలిగి ఉండాలని సంజయ్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories