India vs England Series: బీసీసీఐ కీలక నిర్ణయం

India vs England Series: బీసీసీఐ కీలక నిర్ణయం
x

బీసీసీఐ లోగో  ఫైల్ ఫోటో  

Highlights

క్రికెట్ ఫ్యాన్స్‌‌కు బీసీసీఐ గుడ్ న్యూస్‌ చెప్పింది.

క్రికెట్ ఫ్యాన్స్‌‌కు బీసీసీఐ గుడ్ న్యూస్‌ చెప్పింది. భారత్‌-ఇంగ్లండ్ సిరీస్‌ నుంచి స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. 50శాతం ఆక్యుపెన్సీతో మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా భారత్‌-ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో 50శాతం ప్రేక్షకులను స్డేడియంలోకి అనుమతించనున్నారు. భారత పర్యటనలో నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలను ఇంగ్లండ్ ఆడనుంది.

తొలి టెస్ట్ ఫిబ్ర‌వ‌రి 5న చెన్నైలో కాగా.. తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలో, ఆ త‌ర్వాతి రెండు టెస్టులు, టీ20లు అహ్మ‌దాబాద్‌లోని మొతేరాలో, మూడు వ‌న్డేలు పుణెలో జ‌ర‌గ‌నున్నాయి. తొలి రెండు టెస్ట్‌ల కోసం బీసీసీఐ టీమ్‌ను ప్ర‌క‌టించింది. ఆస్ట్రేలియా టూర్ నుంచి మధ్యలో తప్పుకున్న విరాట్ కోహ్లీ మ‌ళ్లీ కెప్టెన్సీ వ‌హించ‌నుండ‌గా.. హార్దిక పాండ్యా, ఇషాంత్ శ‌ర్మ తిరిగి టీమ్‌లోకి వ‌చ్చారు. ఈ సారిజట్లలో ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. కండరాల గాయంతో ఆటకు దూరమైన హనుమ విహారిని జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ను స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపిక చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories