Team India: టీమిండియాలో ప్రక్షాళన.. పది పాయింట్లతో బీసీసీఐ పాలసీ

Team India: టీమిండియాలో ప్రక్షాళన.. పది పాయింట్లతో బీసీసీఐ పాలసీ
x
Highlights

BCCI - Team India: గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాక వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను ఓడిపోయింది.

BCCI - Team India: గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాక వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను ఓడిపోయింది. దీంతో జట్టు ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావిస్తోంది. గత సమీక్షా సమావేశంలో పలు నిబంధనలను తీసుకురానున్నట్టు సూచనప్రాయంగా వెల్లడించింది. తాజాగా ఇప్పుడు పది పాయింట్లతో కూడిన పాలసీని జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీఎల్ నిషేధం వంటి అంశాలను తీసుకురానున్నారు. ఇక బీసీసీఐ జారీ చేసిన మొత్తం 10 నియమాలు ఏంటో చూద్దాం.

1. ఏదైనా సిరీస్ జరుగుతున్న లేదా జట్టు విదేశీ పర్యటనలో ఉన్నా ఆ సమయంలో ఆటగాళ్లకు వ్యక్తిగత ప్రకటన షూట్‌లు చేయడానికి లేదా స్పాన్నర్‌లతో పని చేయడానికి స్వేచ్ఛ ఉండదు.

2. ఇతర దేశాల్లో ఏదైనా సిరీస్ 45 రోజులకు మించి పర్యటన ఉంటే కుటుంబాలకు కేవలం రెండు వారాల సమయం మాత్రం ఇవ్వనుంది. తక్కువ వ్యవధి గల సిరీస్ లో కేవలం వారం రోజులు మాత్రమే కేటాయించనుంది.

3. ఏ సిరీస్‌కైనా వ్యక్తిగతంగా కాకుండా జట్టుతో పాటే కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్లేయర్ల మధ్య అనుబంధం కలుగుతుంది. ఫ్యామిలీతో ప్రయాణించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలి.

4. ప్రతి క్రికెటర్ జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే దేశీవాళీ పోటీల్లో ఆడాల్సిందే. కుర్రాళ్లతో పాటు సీనియర్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది. సరైన కారణం చూపితే మినహాయింపు ఇస్తారు.

5. జట్టులోని ఎవరైనా సరే బోర్డు అనుమతి లేకుండా వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకెళ్లడం కుదరదు.

6. గతంలో ఎంత లగేజీని వెంట తీసుకెళ్లినా దానికి బీసీసీఐ రుసుం చెల్లించేంది. ఇక నుంచి 150 కేజీల వరకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది. అంతకుమించితే ప్లేయర్లే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

7. ప్రాక్టీస్ చేసేందుకు జట్టులోని ప్రతి క్రికెటర్ రావాలి. సహచర క్రికెటర్లతో కలిసి ఒకే బస్సులో ప్రయాణించాలి.

8. బీసీసీఐ నిర్వహించే మీటింగ్‌లు, కార్యక్రమాలకు అందరూ అందుబాటులో ఉండాలి.

9. ఏదైనా పర్యటనలో సిరీస్ లేదా మ్యాచ్ ముగిసిన వెంటనే కొందరు వ్యక్తిగతంగా వెళ్లిపోతున్నారు.ఇక నుంచి జట్టుతోపాటే వెళ్లాలి. అందరూ కలిసే ప్రయాణించాలి.

10. ఇప్పటివరకు స్టార్ క్రికెటర్లకు వ్యక్తిగత రూమ్‌లు ఇచ్చేవారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవారు. ఇకపై సహచర ప్లేయర్లతో కలిసి రూమ్ ను పంచుకోవాలి. ఫ్యామిలీ వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా ఉండేందుకు అనుమతి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories