టీమిండియా క్రికెటర్‌పై బీసీసీఐ నిషేదం

టీమిండియా క్రికెటర్‌పై బీసీసీఐ నిషేదం
x
బీసీసీఐ ప్రతీకాత్మక చిత్రం
Highlights

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)కు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బురిడీ కొట్టించాడు.

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)కు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బురిడీ కొట్టించాడు. దీంతో అతనిపై నిషేదం విధించింది. ఢిల్లీకి చెందిన అండర్ -19 క్రికెట్ జట్టు ఆటగాడు రామ్‌ నివాస్‌ యాదవ్‌ వయస్సు విషయంలో దొంగ సర్టిఫికేట్‌ ఇచ్చాడనే విషయం వెలుగు చూసింది. అతనిపై నిషేధం విధిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, రెండేళ్ల పాటు ఈ నిషేధం కొనసాగుతోందని బీసీసీఐ తెలిపింది. దీంతో 2020-21, 2021-22 సీజన్‌లలో దేశవాళీ క్రికెట్లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు.

రామ్‌ నివాస్‌ యాదవ్‌ వయసుతో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. దీంతో అతనిపై విచారణ ఆదేశించగా డీడీసీఏ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. డీడీసీఏకు అందజేసిన జాబితాలో అతని జన్మించిన సంవత్సరం 2001గా ఉంది.

1996, జూన్‌ 10వ తేదీన పుడితే బీసీసీఐ ఇచ్చిన పత్రాల్లో 2001, డిసెంబర్‌ 12వ తేదీన జన్మించినట్లు వెల్లడించింది. ఈ విషయం పదోతరగతి సర్టిఫికేట్‌లో బయటపడింది. దీంతో ఏకంగా 5ఏళ్ల తేడాతో బోర్డునే మోసం చేయాలని చూడడంతో బీసీసీఐ సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2018-19 సీజన్‌క అండర్‌-19 క్రికెట్‌ కేటగిరీలో బీసీసీఐ ఢిల్లీ తరపున ఐడీ నంబర్‌ 12968ను రిజస్టర్‌ చేసుకున్నాడ. అసలు విషయం బయటపడడంతో ఐదేళ్లు నిషేదం విధించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories