Gutta Jwala: డబుల్ బొనాంజా.. పెళ్లి రోజునే తల్లి అయిన స్టార్ క్రీడాకారిణి!

Gutta Jwala: డబుల్ బొనాంజా.. పెళ్లి రోజునే తల్లి అయిన స్టార్ క్రీడాకారిణి!
x

Gutta Jwala: డబుల్ బొనాంజా.. పెళ్లి రోజునే తల్లి అయిన స్టార్ క్రీడాకారిణి!

Highlights

Gutta Jwala: భారతదేశానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తల్లి అయ్యారు.

Gutta Jwala: భారతదేశానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తల్లి అయ్యారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గుత్తా జ్వాలాకు ఇది నిజంగా డబుల్ ధమాకా.. ఎందుకంటే ఆమె తల్లి అయిన రోజునే తన పెళ్లి వార్షికోత్సవం రోజు కూడా. గుత్తా జ్వాలా 2021 ఏప్రిల్ 22న తమిళ నటుడు విష్ణు విశాల్‌ను వివాహం చేసుకున్నారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత, 2025 ఏప్రిల్ 22న ఆమె పండంటి ఆడపిల్లను కన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్

గుత్తా జ్వాలా తల్లి అయిన విషయాన్ని ఆమె భర్త విష్ణు విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఆయన తన పోస్ట్‌లో పాపాయి చేతుల ఫోటోను షేర్ చేస్తూ, "మా నాల్గవ పెళ్లి వార్షికోత్సవం రోజున మాకు ఈ బహుమతి లభించింది" అని రాసుకొచ్చారు. అంతేకాకుండా, ఆయన తన మొదటి భార్య కుమారుడు ఆర్యన్‌ను కూడా ఆ పోస్ట్‌లో గుర్తు చేసుకున్నారు.

విష్ణు విశాల్‌కు రెండో భార్య జ్వాల

ఆర్యన్, విష్ణు విశాల్‌కు ఆయన మొదటి భార్య ద్వారా కలిగిన కుమారుడు. విష్ణు విశాల్ మొదటి భార్య రజనీ నటరాజ్ ఒక సినీ నిర్మాత. వీరిద్దరూ 2018లో విడాకులు తీసుకున్నారు. జ్వాలా గుత్తా, విష్ణు విశాల్‌కు రెండో భార్య. 2019 నుండి ప్రేమలో ఉన్న ఈ జంట 2021లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఒక కుమార్తె జన్మించింది.

విష్ణు విశాల్ కూడా జ్వాలకు రెండో భర్తే

విష్ణు విశాల్ కూడా గుత్తా జ్వాలాకు రెండో భర్తే. ఆమె మొదటి వివాహం బ్యాడ్మింటన్ ఆటగాడు చేతన్ ఆనంద్‌తో జరిగింది. 2005లో జరిగిన వీరి వివాహం 2011లో ముగిసింది. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories