Babar Azam History: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్.. ఇప్పుడు 'కింగ్' బాబర్ ఆజమ్!

Babar Azam History: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Rishvik
Published on: 2 Feb 2026 11:58 AM IST
Babar Azam History: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్.. ఇప్పుడు కింగ్ బాబర్ ఆజమ్!
X

Babar Azam History: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్.. ఇప్పుడు 'కింగ్' బాబర్ ఆజమ్!

Babar Azam History: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఫిఫ్టీ చేయడంతో బాబర్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో బాబర్ ఇప్పటివరకు 39 హాఫ్ సెంచరీలు బాదాడు. టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని అధిగమించిన బాబర్.. ఈ ఎలైట్ లిస్ట్‌లో నెంబర్ వన్‌గా నిలిచాడు.

ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో బాబర్ ఆజమ్ మొత్తం 39 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ‘కింగ్’ విరాట్ కోహ్లీ 38 అర్ధ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శన, క్లాస్ బ్యాటింగ్‌తో బాబర్ ఈ రికార్డును అందుకోవడం విశేషం. ఈ జాబితాలో మూడో స్థానంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ 32 అర్ధసెంచరీలు చేశాడు. నాలుగో స్థానంలో పాకిస్థాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (30 అర్ధ సెంచరీలు) ఉండగా.. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (28 అర్ధ సెంచరీలు) నిలిచాడు. విరాట్, రోహిత్ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పోటీగా ఉండే టీ20 ఫార్మాట్‌లో ఇంత నిలకడగా పరుగులు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఈ ఫార్మాట్‌లో బాబర్ ఆజమ్ చూపుతున్న నిలకడ అతన్ని ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలబెడుతోంది. ముఖ్యంగా ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ల్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడడం అతని ప్రత్యేకతగా మారింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి బాబర్ ఈ రికార్డుతో కొత్త చరిత్ర సృష్టించాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఈ రికార్డు మరింత పెరుగుతుందా? లేదా మరెవరన్నా అతన్ని అధిగమిస్తారా? అన్నది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rishvik

Rishvik

Next Story