Axar Patel: అక్షర్‌పై పక్షపాతం ఎందుకు.. వాషింగ్టన్‌కే ఎందుకు ఎక్కువ అవకాశాలు!

Axar Patel
x

Axar Patel: అక్షర్‌పై పక్షపాతం ఎందుకు.. వాషింగ్టన్‌కే ఎందుకు ఎక్కువ అవకాశాలు!

Highlights

Axar Patel: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సఫారీలు ముందుగా బ్యాటింగ్ చేస్తోంది.

Axar Patel: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సఫారీలు ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికల విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై అభిమానుల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను తప్పించి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గంభీర్‌కు అభిమానినేనని చెప్పిన కొందరు విశ్లేషకులు కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరించలేమని అంటున్నారు.

జట్టు మేనేజ్‌మెంట్ ఎప్పుడూ బాగా రాణిస్తున్న అక్షర్‌ పటేల్‌కు కాకుండా.. అడపాదడపా ఆడే వాషింగ్టన్‌ సుందర్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాషింగ్టన్ బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ స్థిరమైన ప్రదర్శన ఇవ్వడం లేదని, అదే సమయంలో అక్షర్ కీలక సందర్భాల్లో వికెట్లు తీసే సామర్థ్యం కలిగిన ఆటగాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ రెండు వికెట్లు తీసి అద్భుత ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేసి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. అలాంటి ఆటగాడిని తప్పించి వాషింగ్టన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జట్టు కూర్పు విషయంలో పారదర్శకత అవసరమని, ఫామ్ ఆధారంగా జట్టు ఎంపిక జరగాలని సూచిస్తున్నారు.

వ్యూహాత్మక నిర్ణయంతోనే తుది జట్టులో మార్పులు చేయలేదని దక్షిణాఫ్రికా టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్‌నే ఎంచుకొనేవాడినని సూర్య తెలిపాడు. అక్షర్‌ పటేల్‌ను పక్కన పెట్టడమే కష్టమే కానీ కూర్పు కోసం తప్పలేదని సూర్య పేర్కొన్నాడు. మరి జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని సుందర్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

భారత జట్టు:

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్‌ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్‌ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి.

Show Full Article
Print Article
Next Story
More Stories