సచిన్ ఔటో కాదో చెప్పండి : వార్న్

సచిన్ ఔటో కాదో చెప్పండి : వార్న్
x
Sachin Tendulkar (File Image)
Highlights

కరోనా వైర‌స్ దెబ్బ ప్ర‌పంచ దేశాల‌న్ని అల్ల‌క‌ల్లోలం అవుతున్నాయి. మరోవైపు క్రీడారంగం కూడా ఈ మ‌హ‌మ్మ‌రి ధాటికి కుదేలైంది.

కరోనా వైర‌స్ దెబ్బ ప్ర‌పంచ దేశాల‌న్ని అల్ల‌క‌ల్లోలం అవుతున్నాయి. మరోవైపు క్రీడారంగం కూడా ఈ మ‌హ‌మ్మ‌రి ధాటికి కుదేలైంది. ఒలింపిక్స్ తో స‌హా అన్ని క్రీడా టోర్నీలు రద్దవ్వగా.. ఐపీఎల్ తోపాటు మ‌రి కొన్ని క్రికెట్ మ్యాచులు వాయిదా పడ్డాయి. ఇక ప్రాణాంతక వైరస్ క‌ట్ట‌డికి ప్రపంచమే స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. దీంతో స్టార్ ప్లేయర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖ క్రికెట‌ర్లు అంతా పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సోషల్ మీడియా వాటిని షేర్ చేస్తున్నారు. రోహిత్ శ‌ర్మ లాంటి ప్లేయ‌ర్లు ఇంకొంతమంది లైవ్ చాట్‌లు చేస్తున్నారు. కెరీర్ సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటున్నారు.

ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా ఓ ఆసక్తికర వీడియోను ట్వీట్ల‌ర్లో పంచుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తనకు ఉన్న సందేహాన్ని తీర్చాల‌ని అభిమానుల‌ను కోరాడు. అది కూడా భార‌త జ‌ట్టు లెజండరీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ గురించి. ఒక సంద‌ర్భంలో సచిన్ ఔట్ సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. 'సీరియస్‌గా చర్చలో పాల్గొనండి.. నాటౌటో చెప్పండి? అని వార్న్ ట్వీట్ చేశాడు.

చెన్నై వేదికగా 1998లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ టెస్టు మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో రాణించాడు. స‌చిన్ త‌న‌ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగుల వద్ద షేన్ వార్న్ బౌలింగ్‌లోనే ఔటైయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో అంపైర్ తప్పిదంతో... సచిన్ ఔట్ నుంచి తప్పించుకున్నాడనేది వార్న్ అభిప్రాయం. ఈ మ్యాచ్‌లో వార్న్ విసిరిన బంతి నేరుగా సచిన్ ప్యాడ్లను తాకింది. దీంతో వార్న్ ఎల్బీడ‌బ్య్లూ కోసం గట్టిగా అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్అంపైర్ దాన్ని తిరస్కరించాడు. ఈ వీడియోను వార్న్ ట్విట‌ర్లో షేర్ చేశాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories