వార్నర్‌ పిల్లల కోరిక కోహ్లీ తీరుస్తాడా

వార్నర్‌ పిల్లల కోరిక కోహ్లీ తీరుస్తాడా
x
David Warner, virat kohli
Highlights

ఆసీస్ క్రికెట్ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గ్రౌండులో ఎంత దూకుడుగా ఉంటాడో సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు.

ఆసీస్ క్రికెట్ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గ్రౌండులో ఎంత దూకుడుగా ఉంటాడో సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా క్రీడా టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌లతో సిరీస్‌లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని వార్నర్‌ తన కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు. ప్రతి జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

కాగా.. డేవిడ్ వార్నర్ తన పిల్లలు ఐవీ-మే, ఇండి-రేలతో కలిసి టిక్‌టాక్‌ గెస్ట్‌ రోల్‌లో నటించి ఆకట్టుకున్నాడు. పిల్లలతో కలిసి ఒక లైవ్‌ వీడియో చాట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీకిష్టమైన క్రికెటర్‌ ఎవరో చెప్పండి అని పిల్లలను అడగ్గానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు చెప్పారు. తండ్రి వైపు తిరిగి నాన్న కూడా ఫేవరెట్‌ క్రికెటర్ అని చెప్పడంతో వార్నర్‌ ముఖంలో ఆనందం వెల్లివెరిసింది. దీంతో వార్నర్ తన పిల్లలతో కోహ్లి ఫోటోగ్రాఫ్‌ కావాలా అని అడిగాడు. దీంతో వారు కోహ్లి అంకుల్‌తో కనిపిస్తే సెల్ఫీ కావాలని అడుగుతామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories