ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు కరోనా దెబ్బ

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు కరోనా దెబ్బ
x
Kane Richardson
Highlights

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు కరోనా దెబ్బ తగిలింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ సన్ కు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో న్యూజిలాండ్...

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు కరోనా దెబ్బ తగిలింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ సన్ కు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో న్యూజిలాండ్ తో జరిగే మొదటి వన్డేకు రిచర్డ్ సన్ దూరమయ్యారు. రిచర్డ్ సన్ రక్త నమూనాలను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపిన ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్ మెంట్ ఫలితం కోసం ఎదురుచూపులు చూస్తోంది.

ఇదిలా ఉండగా, రిచర్డ్‌సన్‌ సాధారణ గొంతు సమస్యతో బాధపడుతున్నట్లు తమ వైద్యబృందం భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అయినా, ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామన్నారు. కాగా, రిచర్డ్‌సన్‌ ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడని, ఈ నేపథ్యంలో అతడిని జట్టుకు దూరంగా ఉంచి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కరోనా పరీక్ష ఫలితాలు రాగానే, కొద్ది రోజుల్లో కోలుకుంటాడని, తిరిగి జట్టులో చేరతాడని సీఏ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories