T20 WorldCup 2021: టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా దూకుడు
* రెండో విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా * ఫామ్‌లోకొచ్చిన వార్నర్, ఫించ్ * శ్రీలంకపై 7 వికెట్లతో కంగారూల గెలుపు
రెండో విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా(ఫైల్ ఫోటో)
T20 WorldCup 2021: టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వార్నర్ సూపర్ బ్యాటింగ్‌తో టచ్‌లోకి రావడం, ఫించ్ ఫామ్‌లోకి రావడంతో శ్రీలంకపై కంగారూలు అలవోక విజయం సాధించారు. వార్నర్ దెబ్బకు లంక ఆటగాళ్లు కోలుకోలేకపోయారు.
డేవిడ్ వార్నర్ 42 బంతుల్లో 10 ఫోర్లతో 65 రన్స్ చేశారు. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. తర్వాత బ్యాట్ పట్టిన ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను రీచ్ అయ్యింది.
Next Story




