తొలిసారి ఐదేసిన సిరాజ్.. భారత్ టార్గెట్ 328.. మ్యాచ్‌కు అంతారాయం..

Australia vs India, 4th Test
x

Australia vs India, 4th Test 

Highlights

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్నగబ్బా టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్నగబ్బా టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసి సమయాని భారత్ రెండో ఇన్నింగ్స్ వికెట్ నష్టాపోకుండా 4 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (4*), గిల్ (0*) కొనసాగుతున్నారు. నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్సింగ్స్ ఇన్నింగ్స్ 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆధిక్యంతో కలిపి 328 విజయ లక్ష్యం టీమిండియా ముందు ఉంచింది. భారత బౌలర్లలో సిరాజ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. శార్థుల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అందుకుముందు 21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కు ఓపెనర్లు వార్నర్, హారిస్ శుభారంబం ఇచ్చారు. ప్రమాదకరంగా మరుతున్న వీరి భాగస్వామ్యాన్ని శార్థుల్ విడదీశాడు. 89 పరుగుల వద్ద ఓపెనర్ హరీస్ (38,82 బంతుల్లో , 8ఫోర్లు) శార్థుల్ బౌలింగ్ లో కీపర్ పంత్ చేతికి దొరికిపోయాడు. మరో ఓపెనర్ వార్నర్(48, 75బంతుల్లో, 6ఫోర్లు) అర్థసెంచరీకి చేరువవుతున్ తరుణంలో సుందర్ బౌలింగ్ లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. స్టీవ్ స్మీత్, లబుషేన్(25) బాధ్యత తీసుకున్నారు. 31వ ఓవర్ బౌలింగ్ అందుకున్న సిరాజ్ లబుషేన్ పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్ ఆరో బంతికి వేడ్ ను ఖాతా తెరవకుండా ఇంటిబాట పట్టించాడు. జట్టు స్కోరు 123 వద్ద నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

కీలక బ్యాట్స్ మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఓ దశలో 200 పరుగుల లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ క్రమంలో స్మీత్, గ్రీన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలోపడ్డారు. ఈ నేపథ్యంలో భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న స్మీత్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్ కు 73 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో సెషన్ తర్వాత భారత బౌలర్లు విజృంబించారు. స్మీత్ ను సిరాజ్ ఔట్ చేస్తే.. గ్రీన్ ను శార్థుల్ అవుట్ చేశాడు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ కుదుపులకులోనైంది. కెప్టెన్ ఫైన్ (27), కమిన్న్ (28) పోరాడారు. అయినప్పటికీ టీమిండియా బౌలర్ల ముందు వారు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్ 294 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌట్ అయింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంబించిన కాసేపటికే వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

నిర్ణయాత్మక టెస్టులో భారత్ విజయం సాధించాలంటే ఆఖరి రోజు 324 పరుగులు చేయాల్సివుంది. 2003లో కూడా భారత్ ఆఖరి రోజు 230 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయసంగా ఛేధించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories