Australia vs India 3rd Test: పట్టుబిగిస్తున్న ఆస్ట్రేలియా.. భారీ ఆధిక్యం

Australia vs India 3rd Test: పట్టుబిగిస్తున్న ఆస్ట్రేలియా.. భారీ ఆధిక్యం
x

Australia vs India 3rd Test

Highlights

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న సీడ్నీ టెస్టులో మూడోరోజు ఆట ముగిసింది.

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న సీడ్నీ టెస్టులో మూడోరోజు ఆట ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఓపెనర్ పకోస్కి (10: 16 బంతుల్లో 2x4)ని మహ్మద్ సిరాజ్ బోల్తా కొట్టించగా.. పదో ఓవర్‌లో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (13: 29 బంతుల్లో 1x4)ని ఎల్బీడబ్ల్యూగా అశ్విన్ ఔట్ చేసేశాడు. దాంతో 35పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఇబ్బందుల్లో పడింది. స్టీవ్‌స్మిత్ (29)తో కలిసి బాధ్యతాయుతంగా ఆడిన మార్కస్ లబుషేన్ (47) మూడో వికెట్‌కి అజేయంగా 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్ 94 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం 197 పరుగులు ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు టీమిండియా బ్యాట్స్ మెన్ తక్కువ పరుగులకే చేతులేత్తేశారు. వర్‌నైట్ స్కోరు 96/2తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ మూడో రోజు తొలి సెషన్ లోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 244 పరుగులకు ముగిసింది. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. పుజారా (50: 176 బంతుల్లో 5x4)హాఫ్ సెంచరీలతో ఫర్వాలేదనిపించగా..చివర్లో రవీంద్ర జడేజా (28 నాటౌట్)విలువైన పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లకు దక్కించుకోగా.. జోష్ హజెల్ వుడ్ రెండు, మిచెల్ స్టార్క్ ఓ వికెట్ పడగొట్టారు.

ఓకెప్టెన్ రహానే (22, 70 బంతుల్లో) త్వరగానే ఔటైయ్యాడు. హనుమ విహారి(4) రనౌటైయ్యాడు. భారత్ భోజన విరామ సమయానికి 79 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ మెరుగ్గానే అనిపించింది. కమిన్స్ బౌలింగ్‌లో ఓ బంతి రిషభ్ పంత్(36) లెఫ్ట్ ఎల్బోకు బలంగా తాకింది. టీమిండియా ఫిజియో పరీక్షించి చికిత్స చేయడంతో పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. నొప్పితో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ పంత్ హజెల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ అలానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. రవిచంద్రన్ అశ్విన్(10) రనౌట్ కాగా.. నవ్‌దీప్ సైనీ(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత బుమ్రా(0) రనౌటయ్యాడు. ఇక సిరాజ్(6)ఔట్ కాగా.. జడేజా(28) పర్వాలేదనిపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories