Australia vs India 3rd Test : టెస్టుల్లో చారిత్రాత్మక ఘట్టం.. సిడ్నీ టెస్టులో తొలి సారి మహిళా అంపైర్ విధులు

Australia vs India  3rd Test : టెస్టుల్లో చారిత్రాత్మక ఘట్టం..  సిడ్నీ టెస్టులో తొలి సారి మహిళా అంపైర్ విధులు
x
Highlights

బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సీడ్నీ వేదికగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్నమూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది.

బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సీడ్నీ వేదికగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్నమూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ కొన్ని అరుదైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఆసీస్ బ్యాటింగ్ చేసే సమయంలో ఓ మహిళ అంపైర్ బాద్యతలు నిర్వహించింది. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిర్ పోలోజాక్ ఫోర్త్ అంపైర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 32 ఏళ్ల పోలోజాక్‌ పురుషుల టెస్ట్‌ మ్యాచ్ కు అఫీషియల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. పోలోజాక్‌ 2019లో ఒమాన్, నమీబియా మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌కి ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా చేశారు. కాగా ఈ మ్యాచ్ లో విధులు నిర్వహించిన తొలి మహిళా ఎంపైర్ గా రికార్డుకెక్కారు.

క్రికెట్లో ఫోర్త్ అంపైర్ విధులు చాలా పరిమితంగానే ఉంటాయి. మ్యాచ్ మధ్యలో బంతుల్ని మార్చడం, మ్యాచ్ కోసం పిచ్‌ని సిద్ధం చేయడం, సబ్‌స్టిట్యూట్‌ని అనుమతించడం, ఆన్ ఫీల్డ్ అంపైర్లకి సాయపడటం లాంటివి ఫోర్త్ అంపైర్ ప్రధాన విధులు. ఈ క్రమంలోనే క్లెయిర్ పోలోజాక్ తన విధులు సక్రమంగా నిర్వర్తించారు. ఐసీసీ రూల్స్ ప్రకారం సిడ్నీ టెస్టుకి ఫోర్త్ అంపైర్‌గా ఐసీసీ ఫ్యానల్ నుంచి ఎవరినైనా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నియమించుకోవచ్చు. పోలోజాక్‌కి అవకాశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఇచ్చింది.

డేవిడ్ వార్నర్ కి వార్నింగ్ కూడా ఇచ్చారు. జట్టు కెప్టెన్, కోచ్‌కి మాత్రమే మ్యాచ్‌కి ముందు పిచ్‌పైకి వెళ్లి పరిశీలించే అధికారం ఉంటుంది. వారిద్దరితో పాటు వార్నర్‌ వెళ్లడంతో పోలోజాక్ సాహసోపేతంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఈ మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది. ఆసీస్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం నుంచి కోలుకుని మూడో టెస్టులో తిరిగి జట్టులో చేరాడు. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ దిగిన వార్నర్ (5) నిరాశపరచగా.. ఓపెన‌ర్ విల్ పకోస్కీ (62పరుగులు, 110 బంతుల్లో 4x4) ఆరంగేట్రంలో రాణించాడు. మార్నస్ లబుషేన్‌ (67పరుగులు, 149 బంతుల్లో 8x4) అర్ధ శతకం సాధించగా.. స్టీవ్‌ స్మిత్‌ (31పరుగులు, 64 బంతుల్లో 5x4) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మొహ్మద్ సిరాజ్‌, నవదీప్ సైనీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories