కామన్వెల్త్‌ క్రికెట్ పోటీల్లో విజేతగా ఆస్ట్రేలియా

Australia is the Winner of the Commonwealth Cricket Competition
x

కామన్వెల్త్‌ క్రికెట్ పోటీల్లో విజేతగా ఆస్ట్రేలియా

Highlights

Commonwealth Games 2022: పోరాడి ఓడిన టీమిండియా మహిళల జట్టు

Commonwealth Games 2022: కామన్వెల్త్‌ క్రికెట్ పోటీల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. కామన్వెల్త్‌ పోటీల్లో నెగ్గి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పరాజయమైన టీమిండియా మహిళల జట్టుకు రజితపతకం లభించింది. బర్మింగ్ హామ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా విజయం సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. వరుసగా వికెట్లు పతనం కావడంతో పరాజయానికి చేరువైంది. టాస్‌గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

దూకుడు ప్రదర్శించిన ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించే దిశగా పరుగులు సా‎ధించింది. టీమిండియా బౌలర్లు కట్టడి చేయడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. మూనీ 61 పరుగులు, కెప్టన్ లన్నింగ్ 36పరుగులు అందించారు. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టుకు ప్రారంభంనుంచి ఇబ్బందులు వెంటాడాయి. ఓపెనర్లు స్మృతిమందాన, షెఫాలి వర్మ వెంటవెంటనే పెవీలియన్ బాటపట్టారు. క్రీజులోకొచ్చిన జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ మ్యాచ్‌ను మలుపు తిప్పేప్రయత్నంచేశారు. విజయతీరం చేర్చే ప్రయత్నంలో వెంటవెంటనే పెవీలియన్ బాటపట్టారు. దీంతో వరుసగా బ్యాటర్లు పెవీలియన్ బాట పట్టడంతో 152 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు బంగారుపతకం, ఇండియా మహిళల జట్టుకు సిల్వర్ మెడల్ లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories