డేవిడ్ వార్నర్ కొత్త అవతారం.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

డేవిడ్ వార్నర్ కొత్త అవతారం.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
x
David Warner
Highlights

ఆసీస్ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రోజుకో అవతారం ఎత్తుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన తెలుగు సినిమాలపై మనసుపడ్డారు.

ఆసీస్ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రోజుకో అవతారం ఎత్తుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన తెలుగు సినిమాలపై మనసుపడ్డారు. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో.. సినిమా పాటలకు స్టెప్పులు వేశారు. మహేష్ బాబు సినిమా డైలాగ్స్‌కు టిక్‌టాక్‌ చేసి అలరించారు.

తాజాగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో గెటప్ వేశారు. ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి అవతారం ఎత్తారు. 'బాహుబలి' సినిమాలోని డైలాగ్‌ చెప్పారు. సైనికుడి గెటప్‌లో తయారై 'అమరేంద్ర బాహుబలి అను నేను..' అంటూ ఆకట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ సినిమా పేరు చెప్పండి చూద్దాం..' అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఇది వైరల్‌ అవుతోంది. కేవలం 20 నిమిషాల్లో ఈ వీడియోను 1.5 లక్షల మంది వీక్షించారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) లో తెలుగు ఫ్రాంచైజీ 'సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌' జట్టుకు వార్నర్‌ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తెలుగు ఫ్రాంచైజీ 'సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌'కు వార్నర్‌ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం లాక్‌డౌన్‌ అమలుతో ఐపీఎల్‌ 2020 వాయిదా పడింది.


View this post on Instagram

Guess the movie!! @sunrisershyd

A post shared by David Warner (@davidwarner31) on


Show Full Article
Print Article
More On
Next Story
More Stories