టీమిండియాతో మ్యాచ్ ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆసీస్‌ బౌలర్

టీమిండియాతో మ్యాచ్ ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆసీస్‌ బౌలర్
x
India Vs Aus
Highlights

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో డిపెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా - భారత్‌ జట్ల మధ్య మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు...

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో డిపెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా - భారత్‌ జట్ల మధ్య మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. కాగా.. భారత్ తొలిసారి టీ20 ప్రపంచకప్‌‌లో టోర్నీలో ఫైనల్ కు చేరింది. ఆసీస్‌ ఆరోసారి ఫైనల్‌కు చేరింది. లీగ్ దశలో రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ ఘనవిజయం సాధించింది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఇక 2వ సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం సొంతం చేసుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధతిలో ఐదు పరుగలు తేడాతో విజయం సొంతం చేసుకుంది.

అయితే ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా బౌలర్‌ మెగాన్‌ స్కట్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వాఖ్యలు చశారు. భారత్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా అని ఆమె అన్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతీ మంధానాలే అందుకు కారణం అని కూడా ఆమె తెలిపారు. షెఫాలీ వర్మ, మంధానాలకు బౌలింగ్ చేయాలంటే భయమేస్తోందని తెలిపారు. భారత్ బ్యాటింగ్ చూస్తే వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా షఫాలీ ఎదురుదాడికి చేస్తే కష్టమని మెగాన్ అన్నారు.

'భారత​జట్టుకు షెఫాలీ, మంధానాలు వెన్నుముక. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇద్దరూ బలమైన షాట్లతో బౌలర్లపై ఎదురుదాడి చేస్తారు. ప్రపంచకప్ టోర్నీకి ముందు ముక్కోణపు సిరీస్‌లో షెఫాలీ వర్మ కొట్టిన సిక్స్‌ నా కెరీర్‌లో మరిచిపోలేనని మెగాన్ అన్నారు. ‌వారిద్దరికి బౌలింగ్‌ చేయడం అంత మంచి కాదేమో. ఇంకా చెప్పాలంటే పవర్‌ ప్లేలో షెఫాలీ, మంధానాలుకు బౌలింగ్ వేయాలంటే కష్టం. ఇద్దరిని త్వరగా పెవిలియన్ చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా అని స్కట్‌ పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మెగాన్‌ స్కట్‌ 17 పరుగులకు రెండు వికెట్లు తీసింది. ఆ మ్యాచ్‌లో మెగాన్ స్కట్‌ వేసిన తన వ్యక్తిగత తొలి ఓవర్‌లో షెఫాలీ వర్మ ధాటికి బెంబేలెత్తిపోయింది. ఆ ఓవర్‌లో షెఫాలీ 4 ఫోర్లు కొట్టి చుక‍్కలు చూపించింది. ఇదే భయం ఇప్పుడు మెగాన్ స్కట్ మరింత కలవర పెడుతున్నట్లు కనబడుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories