IPL2021: కండీషన్‌ అప్లై.. ఐపీఎల్ ఆడేందుకు ఆసీస్ క్రికెటర్లకి గ్రీన్ సిగ్నల్..

IPL2021: కండీషన్‌ అప్లై.. ఐపీఎల్ ఆడేందుకు ఆసీస్ క్రికెటర్లకి గ్రీన్ సిగ్నల్..
x

IPL2021

Highlights

ఐపీఎల్ సిజన్ 14లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తమ క్రికెటర్లకి అనుమతి ఇచ్చింది. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లకు షరతులు పెట్టింది. ఐపీఎల్‌లో ఆడే...

ఐపీఎల్ సిజన్ 14లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తమ క్రికెటర్లకి అనుమతి ఇచ్చింది. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లకు షరతులు పెట్టింది. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేస్తామని, అయితే టోర్నీకి ముందు క్రికెటర్ గాయాలు, ఫిట్‌నెస్‌ని సమీక్షించిన తర్వాతే ఎన్‌వోసీ ఇస్తామని తాజాగా సీఏ స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 18న చెన్నైలో బీసీసీఐ మినీ వేలాన్ని నిర్వహించనుంది. ఐపీఎల్ లో ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ ‌స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, జేమ్స్ పాటిన్‌స‌న్‌, నేథ‌న్ కూల్ట‌ర్ నైల్‌, అలెక్స్ కేరీ, ఆరోన్ ఫించ్‌ ఈసారి వేలంలో ఉన్న విషయం తెలిసిందే. ‌ముఖ్యంగా స్మిత్, మాక్స్‌వెల్, స్టార్క్, ఫించ్‌ భారీ ధర పలికే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్‌పై బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది.

దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ సేకండ్ వేవ్ కారణంగా ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ వదుకుంది. దీంతో న్యూజిలాండ్ ఫైనల్ లిస్ట్ లోని వెల‌లింది. ఈ నెలాఖరులో ఆసీస్ జట్టు సౌతాఫ్రికాలో అడుగుపెట్టాల్సి ఉంది. ఆ తర్వాత బయో సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్‌లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాలి. అయితే కరోనా భయంతో ఆసీస్ సిరీస్ రద్దు చేసుకుంది.

అయితే ఆసీస్ దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు చేసుకోవడంపై ఆ దేశ బోర్డు గుర్రుగా ఉంది. చివరి నిమిషంలో సీఏ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని ఆవేదనకు గురి చేసింది.'అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories