టీమిండియా పర్యటనలో అదరగొట్టిన ఆస్ట్రేలియా

Australia Beat India In First T20
x

టీమిండియా పర్యటనలో అదరగొట్టిన ఆస్ట్రేలియా

Highlights

India vs Australia: నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం

India vs Australia: టీమిండియా పర్యటనలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. మొహలిలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హోరాహోరీ పోరు క్రికెట్ అభిమానులకు మజానిచ్చింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నాలుగు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కెమరాన్ గ్రీన్ జట్టువిజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టాస్ ఓడిన టీమిండియా మ్యాచ్‌ను చేజార్చుకుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. కెప్టన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రారంభంలోనే పెవీలియన్ బాటపట్టారు. లోకేశ్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ స్కోరు బోర్డును చక్కదిద్దారు. ఆఖరిలో క్రీజులోకి వచ్చిన హార్థిక్ పాండ్యా విశ్వరూపం చూపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరు వికెట్లను కోల్పోయి 211 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories