AUS vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం!

AUS vs IRE
x

AUS vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం!

Highlights

AUS vs IRE: భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. కొలొంబో వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

AUS vs IRE: భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. కొలొంబో వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 16.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ బ్యాటర్లలో జార్జ్ డాక్రెల్ టాప్ స్కోరర్. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 రన్స్ చేశాడు. లోర్కాన్ టక్కర్ చేసిన 24 పరుగులే రెండో ఐత్యధిక స్కోర్. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాలు తలో నాలుగు వికెట్స్ పడగొట్టారు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇదే మొదటి మ్యాచ్ కాగా.. రెండు పాయింట్స్ ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా దూరం కాగా.. ట్రావిస్ హెడ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. హిట్టర్ మార్కస్ స్టాయినిస్ (45; 29 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ జోష్‌ ఇంగ్లిస్ (37; 17 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు ధాటిగా ఆడగా.. బ్యాటర్ రెన్ షా (37; 33 బంతుల్లో 2 ఫోర్లు) కీలక పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్ 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 21 రన్స్ బాదాడు. అతడు ఎక్కువసేపు క్రీజులో నిలవకున్నా.. ఉన్నంతసేపు అభిమానులను అలరించాడు. స్టార్ ప్లేయర్స్ ట్రావిస్ హెడ్ (6), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (9) విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 2.. మాథ్యూ హంఫ్రీస్, జార్జ్ డాక్రెల్, హ్యారీ టెక్టర్ తలో వికెట్ పడగొట్టారు.

ఛేదనలో ఐర్లాండ్‌కు శుభారంభం దక్కలేదు, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఒక పరుగు మాత్రమే చేసి రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. హ్యారీ టెక్టర్ డకౌట్ కాగా.. రాస్ అడైర్ (12), కర్టిస్ కాంఫర్ (4) రన్స్ చేశారు. ఆపై బెంజమిన్ కాలిట్జ్ (2), గారెత్ డెలానీ (11) కూడా ఔట్ అవ్వడంతో ఐర్లాండ్‌ ఓటమి ఖాయం అయింది. ఈ సాయంలో జార్జ్ డాక్రెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. ఓటమి అంతరాన్ని తగ్గించాడు. నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాలు చెలరేగడంతో ఐర్లాండ్ 115 పరుగులకే ఆలౌటైంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన నాథన్ ఎల్లిస్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories