క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. మెగా క్రికెట్ టోర్నీ వాయిదా

Asia Cup 2021 Postponed 2023
x

Asia Cup 2021 File Photo

Highlights

Asia Cup 2021: కరోనా వైర‌స్ రెండో ద‌శ వ్యాప్తి అన్ని రంగాల‌పై ప‌డింది.

Asia Cup 2021: కరోనా వైర‌స్ రెండో ద‌శ వ్యాప్తి అన్ని రంగాల‌పై ప‌డింది. క్రీడా రంగంపై ఈ మ‌హ‌మ్మారి పెను ప్ర‌భావం చూపుతుంది. క‌రోనా క‌ల‌క‌లంతో ఇప్ప‌టికే ఐపీఎల్ సీజ‌న్ 14 అర్థాంత‌రంగా వాయిదా ప‌డింది. ఒలింపిక్స్ వంటి విశ్వ క్రీడాసంరంభం సందిగ్ధ‌త ఏర్పడింది. ఇక తాజాగా ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీపైనా కరోనా ప్రభావం పడింది.

రెండేళ్లకోసారి నిర్వహించే ఆసియా క్రికెట్ క‌ప్ పై దీని ప్ర‌భావం ప‌డింది. వివిధ కారణాలతో 2018 నుంచి ఆసియా కప్ నిర్వహణ సాధ్యం కావడంలేదు. 2020లో నిర్వహిద్దామని అనుకుంటే కరోనా ఫస్ట్ వేవ్ అందుకు గండికొట్టింది. ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా ఆసియా కప్ కు అవాంతరాలు సృష్టిస్తోంది.

ఆసియాలో అగ్ర క్రికెట్ జట్లయిన టీమిండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఊపిరి సలపనంతగా అనేక సిరీస్ లు ఆడనున్నాయి. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2022లో కూడా ఆసియా కప్ జరగనుండడంతో, ఈ ఏడాది జరపాల్సిన ఆసియా కప్ ను 2023కి వాయిదా వేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలు తమ షెడ్యూళ్లను మార్చుకోవడంతో, 2021 క్యాలెండర్ లో ఆసియా కప్ కు స్థానం కల్పించడం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కు శక్తికి మించిన పనైంది.


Show Full Article
Print Article
Next Story
More Stories