India Vs England: అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో..

Ashwin awaits Huge Feat in Ahmedabad 3rd Test
x

అశ్విన్: ఫోటో హన్స్ ఇండియా


 

Highlights

India Vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య బుధవారం నుంచి మొతెరా స్టేడియం వేదికగా మూడో టెస్టు ప్రారంభం

India Cricket News: భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డే, టీ20లకి దూరమైనా టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నాడు. టెస్టు కెరీర్‌లో అరుదైన రికార్డ్‌కి చేరువలో ఉన్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య బుధవారం నుంచి అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

గత రెండు టెస్టుల్లో అత్యుత్తమంగా రాణించిన అశ్విన్.. 17.82 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల మార్క్‌ని అశ్విన్ రెండు సార్లు అందు్కున్నాడు. బుధవారం నుంచి జరిగే మూడో టెస్టులో అశ్విన్ 6 వికెట్లు పడగొడితే.. అరుదైన రికార్డ్‌లో చోటు దక్కించుకోనున్నాడు.

2011లో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. ఇప్పటి వరకూ 76 టెస్టు మ్యాచ్‌లాడి 394 ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 10 వికెట్ల మార్క్‌ని 10 సార్లు అందుకున్న అశ్విన్.. ఏకంగా 29 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. మూడో టెస్టులో మరో 6 వికెట్లు పడగొడితే.. టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డ్‌ల్లో నిలవనున్నాడు.

భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో.. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434 వికెట్లు), హర్భజన్ సింగ్ (417) టాప్-3లో కొనసాగుతున్నారు. ఒకవేళ అశ్విన్ 400 వికెట్ల మార్క్‌ని అందుకోగలిగితే.. ఈ ఘనత సాధించిన మూడో భారత స్పిన్నర్‌గా నిలవనున్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 800 వికెట్లతో ముందంజంలో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories