నా గురించి చెప్పినందుకు గర్వంగా ఉంది : అనిల్ కుంబ్లే

నా గురించి చెప్పినందుకు గర్వంగా ఉంది : అనిల్ కుంబ్లే
x
మోదీ, కుంబ్లే ఫైల్ ఫోటో
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే భారత ప్రధాని నరేంద్ర మోదీకి పత్యక ధన్యవాదాలు తెలిపారు.

టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే భారత ప్రధాని నరేంద్ర మోదీకి పత్యక ధన్యవాదాలు తెలిపారు. 'పరీక్ష పే చర్చ'లో తన పేరు ప్రస్తావించడం గొప్ప గౌరవంగా ఉందని చెప్పుకొచ్చారు. మోదీ తన పోరాటాన్ని విద్యార్థులకు చెప్పడంపై సంతోషంగా ఉందన్నారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికి అనిల్ కుంబ్లే శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ 'పరీక్ష పే చర్చ'లో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు 2002లో వెస్టిండీస్ పై కుంబ్లే పోరాట స్పూర్తిని, 2002లో ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ లో లక్ష్మణ్, ద్రావిడ్ అసాధారణ పోరాటాన్ని ప్రస్తావించారు.

ఒకే టెస్ట్ ఇన్నింగ్సులో మొత్తం 10 వికెట్లు సాధించిన ఏకైక టీమిండియా క్రికెటర్ . దవడకి తీవ్ర గాయమైనా టెస్టు మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే కట్టు కట్టుకుని మరీ బౌలింగ్‌ వేశాడు. ఇక 2002లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్ -ద్రవిడ్ జోడీ ఓటమి ముంగిట ఉన్న టీమిండియాని అసాధారణ పోరాటంతో గెలుపు బాట పట్టించారు. ఈ రెండు అంశాల్ని 'పరీక్ష పే చర్చ'లో నరేంద్ర మోడీ ప్రస్తావించారు. భారత్ తరఫున 132 టెస్టుల్లో కుంబ్లే 619 వికెట్లు, 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో సెంచరీ కూడా చేశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories