India vs Bangladesh: తొలి డే/నైట్ టెస్టుకు అమిత్ షా

Amit Shah
x
Amit Shah
Highlights

మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఈడెన్...

మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేధికగా కోల్‌కతాలో జరగనుంది. మొదటి సారి భారత్ బంగ్లా జట్ల మధ్య జరగనున్నచారిత్రక తొలి డే/నైట్ టెస్టు మ్యచ్. అయితే ఈ టెస్టును అంగరంగ వైభవంగా నిర్వహించాలని స్టార్ యాజమాన్యంతోపాటు బీసీసీఐ భావిస్తుంది.

ఈ నేపథ్యంలో డే/నైట్ మ్యాచ్‌కు అతిథిగా బంగ్లా ప్రధాని షేక్ హాసీనా హాజరు కానున్నట్లు సమాచారం. ఇదే మ్యాచ్‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హాజరుకానున్నారు. ఇదే మ్యాచ్‌కు మరో ముఖ‌్య అతిథిగా బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత షా కూడా హాజరుకానున్నారు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలని అందుకు కెప్టెన్ కోహ్లీని , బంగ్లా క్రికెట్ బోర్డును కూడా ఒప్పించారు. ఈ క్రమంలో స్టార్ యాజమాన్యం ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

22 జరిగే టెస్టు మ్యాచ్ కు స్టార్, బీసీసీఐ సంయుక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పింక్ బాల్ మ్యాచ్ కు భారత క్రికెట్ టీమ్ కు సేవలందించిన కెప్టెన్లు, ఆటగాళ్లను ఆహ్వానించనుంది. మాస్టర్ బ్లాస్టార్ సచిన్ టెండ్యూలకర్, అలాగే టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బాక్సింగ్ చాంపియన్ మేరికోమ్ సహా పలువురు ఆటగాళ్లు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories