Ambati Rayudu: మీ టీమ్‌ ఏమైనా ధర్మసత్రమా? ద్రవిడ్‌కు పరోక్షంగా కౌంటర్లు వేసిన రాయుడు!

Ambati Rayudu
x

Ambati Rayudu: మీ టీమ్‌ ఏమైనా ధర్మసత్రమా? ద్రవిడ్‌కు పరోక్షంగా కౌంటర్లు వేసిన రాయుడు!

Highlights

Ambati Rayudu: రాయుడికి మొదటి వివాదాస్పద వ్యాఖ్య కాదు. ఈ సీజన్‌లో ఎంఎస్ ధోనిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు, ట్వీట్లు కూడా అభిమానుల్లో చర్చలకు దారి తీశాయి.

Ambati Rayudu: అంబటి రాయుడు రాజస్తాన్ రాయల్స్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐపీఎల్ 2025లో రాజస్తాన్ బోణీగా ప్రారంభించినా, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాల్ని దూరంగా నెట్టేసుకుంది. లక్నో, ఢిల్లీ లాంటి జట్లతో తేలికపాటి లక్ష్యాల్ని ఛేదించలేక ఓడిన తర్వాత రాజస్తాన్ ఆటతీరు పై రాయుడు గట్టి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా రాజస్తాన్ 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 విజయాలకే పరిమితమైంది. ఇటీవల జరిగిన లక్నో మ్యాచ్‌లో 9 పరుగుల లక్ష్యం ఉండగా, యశస్వి జైస్వాల్, రియన్ పరాగ్ ఇద్దరూ దశాబ్దపు ఆటగాళ్లుగా కనిపించకపోవడంపై రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆటలో యువతను ప్రోత్సహించడం గొప్పదే అయినా, 17 ఏళ్లుగా ట్రోఫీ దక్కని రాజస్తాన్ తమ తీరుతో 'చారిటీ' నిర్వహిస్తున్నట్టు ఉందని విమర్శించారు. యువ ఆటగాళ్లను ప్లాట్‌ఫామ్‌ ఇవ్వడం ఒక మంచి విషయం అయినా, జట్టు విజయాలపై దృష్టి పెట్టకపోవడం ఆలోచనీయమన్నారు.

అయితే ఇది రాయుడికి మొదటి వివాదాస్పద వ్యాఖ్య కాదు. ఈ సీజన్‌లో ఎంఎస్ ధోనిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు, ట్వీట్లు కూడా అభిమానుల్లో చర్చలకు దారి తీశాయి. కామెంటరీలో ధోనీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడని కొందరు విమర్శలు కూడా చేశారు. రాజస్తాన్ యువ ఆటగాళ్లపై నమ్మకాన్ని చూపుతోంది. కానీ ఆ నమ్మకానికి ఫలితాలు లేకపోవడం వల్ల అభిమానుల్లో నిరాశ ఎక్కువైంది. జైస్వాల్, పరాగ్, సూర్యవంశీ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లను తీసుకున్నా, మ్యాచ్‌లు ముగించే స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోవడం చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories