ఏసీబీ కేసులు ఉన్నవారికే అసోషియేషన్ పట్టం కడుతుంది అంబటి రాయుడు ట్వీట్


హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ పై ఆరోపణలు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ అక్రమాలకి పాల్పడుతున్న వారిపై ...
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ పై ఆరోపణలు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ అక్రమాలకి పాల్పడుతున్న వారిపై ఏసీబీ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. ఏసీబీ కేసులు ఉన్న వారినే అసోషియేషన్ అందలం ఎక్కిస్తుందని ఆరోపించారు. దేశవాళీ టోర్నీల్లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా అంబటి రాయుడు చేశారు. అయితే ఇక నుంచి హైదరాబాద్ జట్టు తరపున రంజీ మ్యాచ్ లు ఆడనని స్పష్టం చేశారు. గతంలో ఇండియా టీమ్ కు రాయుడు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లి వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే
అంబటి ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ ఇంకా స్పందిచలేదు. హెచ్‌సీఏ ఆరోపణలు చేస్తూ అంబటి రాయుడు చేసిన ట్వీట్ పై చర్చలు మొదలైయ్యాయి. హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉండి వచ్చే ఐపీఎల్ 2020పై అంబటి రాయుడు దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. అంబటి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగానే హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీల్లో ఆడే అవకాశం అతని వచ్చింది. దీంతో హైదరాబాద్ జట్టును అంబటి నడిపించారు. ఈ మ్యాచ్ ల్లో అంబటి ప్రదర్శన నిరాసపరిచింది. దీంతో జట్టులోని రాజకీయాలు ఆటను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Hello sir @KTRTRS, I request u to plz look into nd address the rampant corruption prevailing in hca. Hw can hyderabad be great when it's cricket team is influenced by money nd corrupt ppl who hav numerous acb cases against them which are being swept under the carpet.
— Ambati Rayudu (@RayuduAmbati) November 23, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



