IPL 2022: ఐపీఎల్‌లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ

Ahmedabad and Lucknow New Teams Entered Into IPL 2022 | Cricket News
x

IPL 2022: ఐపీఎల్‌లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ

Highlights

IPL 2022: * అహ్మదాబాద్ జట్టుని కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్స్ * లక్నో జట్టుని దక్కించుకున్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్

IPL 2022: ఐపీఎల్‌లోకి కొత్తగా రెండు జట్లు ప్రవేశించాయి. గత కొన్ని సీజన్లుగా 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. 2022 సీజన్ నుంచి అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పోటీపడనున్నాయి. అహ్మదాబాద్ జట్టుని 5వేల 625 కోట్లకి.. CVC క్యాపిటల్ పాట్నర్స్ దక్కించుకోగా.. లక్నో జట్టుని 7వేల 90 కోట్లకి RPSG గ్రూప్ చేజిక్కించుకుంది.

దీంతో ప్రపంచంలో బీసీసీఐ అత్యంత ధనిక బోర్డుగా మార్చిన ఈ టీ20 లీగ్ ఇంకో 12వేల 715 కోట్ల రూపాయలను ఖజానాలో చేర్చింది. ఇకపై 10 జట్లతో ఐపీఎల్ జరగనుంది. ఇప్పటి వరకు టోర్నీలో 60 మ్యాచ్‌లు జరుగుతుండగా.. ఆ సంఖ్య ఇక 74కి చేరనుంది.

వాస్తవానికి బీసీసీఐ బిడ్‌లను ఆహ్వానించిన తర్వాత ఏకంగా 22 కంపెనీలు 10 లక్షల రూపాయలు విలువ చేసే టెండర్ పేపర్స్‌ని కొనుగోలు చేశాయి. కానీ.. బీసీసీఐ ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర 2వేల కోట్లుగా నిర్ణయించడంతో తీరా బిడ్‌లు వేసే సమయానికి కొన్ని వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. బిడ్ దాఖలు చేసిన కంపెనీల్లో అదాని గ్రూప్, కొటక్ టోరెంట్ ఫార్మా పేర్లు కూడా వినిపించాయి. అలాగే బాలీవుడ్ జంట రణవీర్ - దీపికా కూడా ఫ్రాంఛైజీ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఐపీఎల్‌లో 8 జట్లు కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్‌లో కొనసాగుతుండగా కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పోటీపడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories