ఓటమి ముంగిట్లో అఫ్గానిస్తాన్‌

ఓటమి ముంగిట్లో అఫ్గానిస్తాన్‌
x
Afghanistan vs West Indies
Highlights

లక్నో వేదికగా విండీస్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ జట్టు ఓటమి అంచున ఉంది.

లక్నో వేదికగా విండీస్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ జట్టు ఓటమి అంచున ఉంది. రెండో రోజు గురువారం ఆటముగిసే సమయానికి అఫ్గానిస్తాన్‌ జట్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ఓపెనర్‌ జావెద్‌ అహ్మదీ(62 పరుగులు, 93 బంతుల్లో 11 ఫోర్లు) సాధించాడు. జార్ధారన్ 23 పరుగులు చేశాడు. మొదటి వికెట్ కు 53పరుగుల భాగస్వామన్యం నెలకొల్పారు. తర్వాత వచ్చిన ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్స్‌ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అఫ్గానిస్తాన్‌ 19 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మరో మూడువికెట్లు మిగిలి ఉన్నాయి. వెస్టిండీస్ బౌలర్లలో రకీమ్‌ కార్న్‌వాల్‌ 41 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. చేజ్‌ 10 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో అఫ్గాన్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 68/2తో మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్ 83.3 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ 90 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. విండీస్ బ్యాట్స్ మెన్స్ షామర్‌ బ్రూక్స్‌ (111 పరుగులు, 214 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీతో సాధించాడు. క్యాంప్‌బెల్‌ 55; 7 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధసెంచరీతో రాణించాడు. డౌరిచ్‌ 42; 6 ఫోర్ల పరుగులు సాధించాడు. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో అమీర్ ఆజ్మా ఐదు వికెట్లు తీసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories