వైరల్ ; అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్‌ ట్రిక్‌

kieron pollard
x
kieron pollard
Highlights

వెస్టిండీస్ కెప్టెన్‌, ఆల్‌ రౌండర్‌ కీరన్ పొలార్డ్ మళ్లీ వార్తల్లోని ఎక్కాడు. తాజాగా లక్నోలో అఫ్గానిస్తాన్‌‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్...

వెస్టిండీస్ కెప్టెన్‌, ఆల్‌ రౌండర్‌ కీరన్ పొలార్డ్ మళ్లీ వార్తల్లోని ఎక్కాడు. తాజాగా లక్నోలో అఫ్గానిస్తాన్‌‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ నోబాల్ బౌలింగ్ వేస్తున్న క్రమంలో ఉన్నపళంగా ఆగిపోయాడు. క్రికెట్ లో నోబాల్ డెడ్ బాట్ సాధారణంగా జరుగుతుంటాయి. అఫ్గానిస్తాన్‌ తో జరిగన మ్యాచ్ 25వ ఓవర్లో వేసేందుకు పోలార్డు ముందుకు వచ్చాడు. అఫ్గానిస్తాన్‌ మాజీ సారధి అస్గర్‌ అఫ్గాన్‌ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్‌లో నజిబుల్లా జద్రాన్‌ ఉన్నాడు. 25వ ఓవర్ బౌలింగ్ వచ్చిన పోలార్డ్ ఫీల్డ్ అంపైర్‌‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. బంతిని విసిరే క్రమంలో క్రీజు వెలుపల కాలు ఉంచాడు. దీంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే అంపైర్ నోటి వెంట నోబాల్‌ అని వచ్చే లోగా పోలార్డ్ బోల్ విసరడం ఆపేశాడు. దీంతో అపైంర్ నోబాల్ ప్రకటించడం ఆపేశాడు. డెడ్‌బాల్‌గా ప్రకటించాడు.. పోలార్డ్ చేసిన పని వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ బౌలర్ అక్తర్‌ ను గుర్తు తెస్తుంది. అక్తర్ కూడా ఇలాంటి ట్రిక్‌ను ఫాలో అయ్యేవాడు. పోలార్డ్ నోబాల్ మీడియో, అక్తర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 249 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్ జట్టులో ఓపెనర్ హజ్రతుల్లా (50) 59 బంతుల్లో 7ఫోర్లు 2 సిక్సులు సాధించాడు‎, అస్గర్ అఫ్గాన్ (86), మహ్మద్ నబీ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 250 పరుగల విజయ లక్ష్యాన్ని 48.4 ఓవర్లలోనే 253/5 వెస్టిండీస్ జట్టు చేధించింది. షైహోప్ 109 నాటౌట్ 145 బంతుల్లో ఏనిమిది ఫోర్లు మూడు సిక్సులు ఉన్నాయి. ‎మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఐదేళ్ల తర్వాత విండీస్ జట్టు సిిరీస్ గెలవడం ఇదే తొలి సారి. నవంబర్ 14 నుంచి రెండు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories