Rashid Khan: 25 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు.. స్పెషల్ రికార్డ్ సృష్టించిన రషీద్

Afghanistan Bowler Rashid Khan Completed 600 Wickets in T20 Format check Stats and Records
x

Rashid Khan: 25 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు.. స్పెషల్ రికార్డ్ సృష్టించిన రషీద్

Highlights

Most Wickets In T20: ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకటిగా పేరుగాంచాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో రషీద్ ఖాన్‌కు తిరుగేలేదు. రషీద్ ఖాన్ తన గూగ్లీ, వేరియేషన్‌లతో బ్యాట్స్‌మెన్‌కు కీలక సవాలుగా నిరూపించుకున్నాడు.

Rashid Khan Stats & Records: ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకటిగా పేరుగాంచాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో రషీద్ ఖాన్‌కు తిరుగేలేదు. రషీద్ ఖాన్ తన గూగ్లీ, వేరియేషన్‌లతో బ్యాట్స్‌మెన్‌కు కీలక సవాలుగా నిరూపించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు, అతను IPL, ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌లలో ఆడుతున్నాడు. అయితే, టీ20 ఫార్మాట్‌లో రషీద్ ఖాన్ రికార్డ్ ఏంటో తెలుసా? నిజానికి ఈ ఫార్మాట్‌లో ఆఫ్ఘన్ బౌలర్ల రికార్డు అద్భుతమైనది. కేవలం 25 ఏళ్లకే 600 టీ20 వికెట్లు తీసిన ఘనత రషీద్‌ ఖాన్‌ సొంతం చేసుకున్నాడు.

టీ20 ఫార్మాట్‌లో 600 వికెట్లు తీసిన ఘనత రషీద్‌ ఖాన్‌ మినహా మరే ఇతర బౌలర్‌కు లేడు. రషీద్ ఖాన్ టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే.. ఈ బౌలర్ ఆఫ్ఘనిస్థాన్‌కు 93 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆఫ్ఘనిస్థాన్ తరపున, రషీద్ ఖాన్ 6.08 ఎకానమీ, 14.14 సగటుతో 152 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ టీ20 ఫార్మాట్‌లో రెండుసార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఇది కాకుండా 7 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో రషీద్ ఖాన్ అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 5 పరుగులకు 3 వికెట్లు తీయడం.

ఇది కాకుండా, రషీద్ ఖాన్ IPLలో 121 మ్యాచ్‌లలో 6.82 ఎకానమీ, 21.83 సగటుతో 149 వికెట్లు పడగొట్టాడు. ఈ లీగ్‌లో రషీద్ ఖాన్ అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 24 పరుగులకు 4 వికెట్లు తీయడం. ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు, రషీద్ ఖాన్ IPL, బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ క్రికెట్ లీగ్‌లతో సహా అనేక లీగ్‌లలో ఆడతుడున్నాడు. తాజాగా రషీద్ ఖాన్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. అయితే, సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories