
వ్యక్తుల నిజజీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రాలు భారీ హిట్స్ సాధిస్తున్నాయి.
వ్యక్తుల నిజజీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రాలు భారీ హిట్స్ సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టైటిల్ పాత్రకు హీరోయిన్ తాప్సీని చేస్తున్నారు. విథాలీ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు.
శభాష్ మీతు అనే పేరుతో బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ బయోపిక్‌లో మిథాలీ రాజ్‌గా తాప్సీ నటిస్తున్నారు. మిథాలీరాజ్ పాత్రలో తాప్సీ ఒదిగిపోయారని తెలుస్తుంది. ఈ సందర్భంగా తాప్సీ స్పందించారు. మిథాలీ జీవిత ప్రస్ధానాన్ని స్క్రీన్‌పై పంచుకోవడంలో గర్వపడుతున్నానని తాప్సీ వెల్లడించారు. శభాష్‌మిథులో మిథాలీని తనలో చూసుకునేలా నటిస్తానని తాప్సీ తెలిపారు. కవర్‌డ్రైవ్ ఎలా ఆడాలో నేర్చుకునేందుకు రెడీగా ఉన్నానని తాప్సీ అన్నారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
తాప్సీ నటించిన బైలింగ్వల్ మూవీ 'గేమ్ ఓవర్' తెలుగుతోపాటు తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తర్వాత బాలీవుడ్ లో మిషన్ మంగళ్, మరో చిత్రంలోను విభిన్న పాత్రలో తాస్సీ నటించారు. కాగా బయోపిక్ చిత్రంలో తాప్సీ తొలిసారిగా నటిస్తుంది. టీమిండియా మహిళ క్రికెట్ జట్టు సారథి మిథాలి రాజ్ 203 వన్డేల్లో ఆడి 6,731 పరుగులు సాధించింది. 89 టీ20లు 2,364 పరుగులు చేసింది. పది టెస్టుల్లో 663పరుగులు సాధించారు.
క్రీడాకారులపై బయోపిక్ చిత్రాలు రావడం కొత్తకాదు. గతంలోనూ అంతర్జాతీయ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన రికార్డుల రారాజు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిజజీవిత చరిత్ర ఆధారంగా సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ బయోపిక్ చిత్రం విడుదలైంది. అలాగే క్రికెటర్లు అజహరుద్దీన్, ధోనిల చెందిన బయోపిక్ చిత్రాలు హిట్ గా నిలిచాయి. భారత మహిళ బాక్సింగ్ క్వీన్ మేరికోమ్ జీవిత కథ ఆధారంగానూ, గీతా ఫౌగట్, బాటీయా ఫౌగట్ జీవిత కథతోనూ దంగల్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Thrilled to announce our next with @taapsee takes guard as @M_Raj03, untold & ignored story of the rise of Indian women cricket, in a cricket crazy nation! When world goes big on cricket, we go different, #artoflookingsideways. So waited for this moment. Happy birthday Mithali! pic.twitter.com/w4RhPFuuqu
— Ajit Andhare (@AndhareAjit) December 3, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




