కోబ్ ఎలా చనిపోతాడో 2012లోనే చెప్పిన నెటిజన్.. ట్వీట్ వైరల్

కోబ్ ఎలా చనిపోతాడో 2012లోనే చెప్పిన నెటిజన్.. ట్వీట్ వైరల్
x
Kobe File Photo
Highlights

కోబ్ బ్రయింట్ మరణ వార్తను ముందుగానే ఓ నెటిజన్ ఊహించాడు.

బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్ బ్రయింట్ (41) హెలికాప్టర్ ప్రమాదంలో అయన మృతి చెందారు. అనుకోకుండా హెలికాప్టర్ కొండను ఢీ కొట్టడంతో అయనతో పాటు అయన కూతురుతో జియానా(13) సహా మరో 9 మంది మృతి చెందారు. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించింది. కానీ అప్పటికే వారు మృతి చెందారు. కోబ్ మరణంతో క్రీడా ప్రపంచం అంతా శోక సంముద్రంలో మునిగిపోయింది.

కోబ్ బ్రయింట్ మరణ వార్తను ముందుగానే ఓ నెటిజన్ ఊహించాడు. ఏడేళ్ల కింద అంటే 2012లో అతను చేసిన ట్విట్ వైరల్ గా మారింది. నోసో అనే ఓ నెటిజన్ దిగ్గజ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణిస్తాడిని ట్విట్ చేశాడు. 2012 నవంబర్ 14న నోసో చేసిన ట్వీట్ పై అప్పటి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోసోకు పిచ్చిపట్టిందని విమర్శలు చేశారు.

అయితే నోసో చెప్పినట్లు కోబ్ బ్రయింట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించాడు. దీంతో ఓ నెటిజన్ ఆ ట్వీట్ కు క్షమాపణలు చెప్పాడు. ఆదివారం ఉదయం సుమారు 9గంటలకు కోబ్ ప్రయాణిస్తు్న్న హెలికాఫ్టర్ లాస్ ఏంజెల్స్ లోని ఓ కొండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోబ్ సహా అతని కుమార్తె జీయానా కూడా మృతి చెందారు. ఆ నెటిజన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరూ కోబ్ బ్రయింట్ మరణ వార్త ముందుగా ఎలా చెప్పగలిగాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కోబ్ బ్రయింట్ 1996లో బాస్కెట్‌‌బాల్ కెరీర్‌ని ప్రారంభించిన బ్రయింట్‌ 2016లో బాస్కెట్‌‌బాల్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కోబ్ బ్రయింట్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. తన కెరీర్లో ఐదు సార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచి దాదాపుగా రెండు దశాబ్దాల పాటు బాస్కెట్‌బాల్‌‌‌లో తిరుగులేని ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా 'డియర్ బాస్కెట్‌బాల్' పేరుతో అతను రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌కి ఆస్కార్ కూడా వచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories