టీమిండియా ఓటమితో ఆగిన అభిమాని గుండె

A Fan Heart Stopped With Team India Defeat
x

టీమిండియా ఓటమితో ఆగిన అభిమాని గుండె

Highlights

*ఓటమిని తట్టుకోలేక కుప్పకూలిన జ్యోతికుమార్

Team India: వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా పరాజయం... కోట్లాదిమంది అభిమానులను కలిచివేసింది. అయితే ఓ క్రికెట్ అభిమాని గుండె ఆగేలా చేసింది. వరల్డ్ కప్ క్రికెట్‌లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేక గుండె ఆగి మృతి చెందిన ఘటన... కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్నేహితులతో కలిసి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను తిరుపతి రూరల్ మండలానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ జ్యోతి కుమార్ ఎంతో ఉత్సాహంగా చూస్తూ వచ్చాడు.

ఇండియా ఓటమి చెందడంతో ఆ బాధను తట్టుకోలేని జ్యోతికుమార్... ఒక్కసారిగా కుప్పకూలాడు. జ్యోతికుమార్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. దీంతో మృతుడి స్వగ్రామమైన దుర్గా సముద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories