ఐపీఎల్‌ వేలం కోసం 971మంది క్రికెటర్ల పేర్లు నమోదు

ఐపీఎల్‌ వేలం కోసం 971మంది క్రికెటర్ల పేర్లు నమోదు
x
IPl
Highlights

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) ‌2020 సీజన్ కోసం ఈ సారి తొమ్మిది వందల మందిపైగా క్రికెటర్లు పోటీ పడనున్నారు. ఈ నెలలో జరిగే వేలంపాటలో 971 మంది...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) ‌2020 సీజన్ కోసం ఈ సారి తొమ్మిది వందల మందిపైగా క్రికెటర్లు పోటీ పడనున్నారు. ఈ నెలలో జరిగే వేలంపాటలో 971 మంది అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. నవంబర్‌ 30లోగా చివరి తేదీ కాగా ఆ గడుపు ముగిసేలోగా వీరంతా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 971 మంది క్రికెటర్లలో 713 మంది భారతదేశాలనికి చెందిన ఆటగాళ్లున్నారు. ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు 258 మంది ఉన్నారు. భారత క్రికెటర్లలో 19 మంది టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. మిగతా 633 మంది ఎప్పుడూ జాతీయ జట్టు తరపున ఆడలేదు. మరో 60 మంది పేయర్లు ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది.

కాగా.. డిసెంబర్‌ 19న కోల్‌కతాలో క్రికెటర్ల వేలం నిర్వహిస్తారు. అయితే ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన క్రికెటర్ల పేర్లను డిసెంబంర్ 9వతేదీ లోగా సమర్పించాల్సి ఉంటుంది. 971మంది కాకుండా ప్రాంచైజీలు సమర్పించిన జాబితాలో ఉన్న వారినే వేలంలో అనుమతి ఉంటుంది. ఐపీఎల్‌ సీజన్ లో 73 మందిని ఎంపిక చేసుకునే అవకావం ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories