Team India: క్రికెట్‌లో 183 ప్రత్యేకత.. ఈ మార్కును దాటిన ఆటగాడే తర్వాతి కెప్టెన్.. ఇంతకీ వాళ్లెవరంటే..

183 is the special number for team India
x

క్రికెట్‌లో 183 ప్రత్యేకత.. ఈ మార్కును దాటిన ఆటగాడే తర్వాతి కెప్టెన్.. ఇంతకీ వాళ్లెవరంటే..

Highlights

సౌరవ్ గంగూలీ, ఎం.ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఈ ముగ్గురు టీమిండియాకి సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాదు.. అప్పటి దాక ఉన్న కెప్టెన్ల కంటే ఎక్కువ విజయాలు అందుకున్నారు.

Team India: సౌరవ్ గంగూలీ, ఎం.ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఈ ముగ్గురు టీమిండియాకి సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాదు.. అప్పటి దాక ఉన్న కెప్టెన్ల కంటే ఎక్కువ విజయాలు అందుకున్నారు. అయితే ఈ ముగ్గురికి ఓ నెంబర్‌తో సెపరేట్ కనెక్షన్ ఉంది. అదే 183.. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయిన ఎంఎస్ ధోనీ, గంగూలీ, కోహ్లీల అత్యధిక స్కోరు ఇదే. దీని వెనుక ఓ ఆసక్తికర విషయం ఉంది. ఈ ముగ్గురు క్రికెటర్లు.. ఆ నంబర్‌ను అందుకున్న తర్వాతే టీమిండియా జట్టుకు కెప్టెన్లుగా మారారు. ఆ తర్వాత ఎన్నో చిరస్మరణీయ రికార్డులను సాధించారు.

మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో సౌరవ్ గంగూలీ 183 కొడితే, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ధోనీ ఈ ఫీట్ సాధించాడు. ధోని కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు.

భారత క్రికెట్ టీమ్ 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో మొదటిసారిగా ప్రపంచ కప్ సాధించింది. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టుపై మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయింది. అప్పటికి వన్డే మ్యాచులలో ఒక ఇన్నింగ్స్‌కు 60 ఓవర్లు ఉండేవి. ఆ సమయంలో అంతా వెస్టిండిస్‌దే ప్రపంచ కప్ అనుకున్నారు. అనూహ్యంగా వెస్టిండిస్‌ను భారత్ 52 ఓవర్లలో 140 పరులకే ఆలౌట్ చేసింది. 43 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

క్రికెట్‌లో భారత్ దశను మలుపు తిప్పిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీకి పేరు. వన్డేల్లో గంగూలీ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. 1999 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై సాధించాడు. కేవలం 158 బంతుల్లోనే ఈ స్కోర్ సాధించాడు.

మహేంద్ర సింగ్ ధోనీ వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183 పరుగులు. ఈ సారి కూడా ప్రత్యర్థి శ్రీలంకనే. 2005లో ధోనీ ఈ ఘనతను సాధించాడు. 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సులు కొట్టి ఈ పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

విరాట్ కోహ్లీకి వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు 183 పరుగులు. కోహ్లీ ఈ ఘనత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 2012లో సాధించాడు. ఇందులో 22 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

మరో విచిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ వ్యక్తిగత కెరీర్లో 183 పరుగుల అత్యధిక స్కోర్ చేసింది వన్డే కెరీర్‌లోనే. మహహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో గంగూలీ, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ధోనీ, ధోనీ కెప్టెన్సీలో కోహ్లీ ఈ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఈ మూడు సందర్భాల్లోనూ టీమిండియా విజయం సాధించడం మరో విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories