ద్రవిడ్‌కు నోటీసులు.... వీడని కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ అంశం

ద్రవిడ్‌కు నోటీసులు.... వీడని కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ అంశం
x
Highlights

టీమిండియా మాజీ క్రికెటర్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ను పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం(కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్) నుంచి విముక్తి లభించడంలేదు.

టీమిండియా మాజీ క్రికెటర్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ను పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం(కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్) నుంచి విముక్తి లభించడంలేదు. నవంబర్‌ 12వ తేదీన జస్టిస్ జైన్‌ ముందు ద్రవిడ్‌ హాజరు కావాలని నోటీసులు పంపించారు. గత నెల 26న కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ అంశంపై డీకే జైన్‌ ముందు రాహుల్ ద్రవిడ్ హాజరైయిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు యాజమాన్యానికి చెందిన ఇండియా సిమెంట్స్‌ కంపెనీకి ద్రవిడ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇండియా Aజట్లుకు కోచ్ గా వ్యవహారిస్తున్నారు. ద్రవిడ్‌ కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ కిందకు వస్తాడంటూ.. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(Mca) సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశారు.

సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన డీకే జైన్ ద్రవిడ్ మళ్లీ హాజరుకావాలని ఆదేశించారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ఆటగాడిగా ఎవరూ శాశ్వతంగా ఉండలేరని కోచింగ్, కామెంట్రీ, ఇలాంటివి పరస్సర విరుద్ధ అంశాలు ఎందుకు అవుతాయని ప్రశ్నించారు. దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని గంగూలీ పేర్కొన్నారు. భారత క్రికెట్ ను దేవుడే రక్షించాలని ట్వీట్ చేశారు. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ ఎథిక్స్‌ రిటైర్డ్‌ అధికారి జస్టిస్‌ డీకే జైన్‌ ముందు ద్రవిడ్ మరోసారి హాజరుకానున్నారు. గతంలో డీకేజైన్ ముందు హాజరైనా ద్రవిడ్ తాను ఇండియా సిమెంట్స్‌కు విరామం తీసుకున్నానని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories